Telugu Global
Others

స్పీక‌ర్ కు లేఖ రాయ‌డం అగౌర‌వ‌మా?

వైఎస్ చిత్ర‌ప‌టం తొల‌గింపు ఉదంతంలో కొత్త మ‌లుపు శాస‌న‌స‌భ ప్రాంగ‌ణంలో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చిత్ర‌ప‌టం తొల‌గింపు వివాదం కొత్త మ‌లుపు తీసుకుంది. ఈ వ్య‌వ‌హారంలో ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్పీక‌ర్‌కు బ‌హిరంగ లేఖ రాయ‌డం వివాదాస్ప‌దంగా మారింది. అలా బ‌హిరంగ లేఖ రాయ‌డం స్పీక‌ర్ స్థానాన్ని కించ‌ప‌ర‌చ‌డ‌మేన‌ని శాస‌న‌స‌భ సాధార‌ణ వ్య‌వ‌హారాల క‌మిటీ అభిప్రాయ‌ప‌డింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటం ఏర్పాటులో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు క‌మిటీలో మెజారిటీ  సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ కమిటీ […]

స్పీక‌ర్ కు లేఖ రాయ‌డం అగౌర‌వ‌మా?
X
వైఎస్ చిత్ర‌ప‌టం తొల‌గింపు ఉదంతంలో కొత్త మ‌లుపు
శాస‌న‌స‌భ ప్రాంగ‌ణంలో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చిత్ర‌ప‌టం తొల‌గింపు వివాదం కొత్త మ‌లుపు తీసుకుంది. ఈ వ్య‌వ‌హారంలో ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్పీక‌ర్‌కు బ‌హిరంగ లేఖ రాయ‌డం వివాదాస్ప‌దంగా మారింది. అలా బ‌హిరంగ లేఖ రాయ‌డం స్పీక‌ర్ స్థానాన్ని కించ‌ప‌ర‌చ‌డ‌మేన‌ని శాస‌న‌స‌భ సాధార‌ణ వ్య‌వ‌హారాల క‌మిటీ అభిప్రాయ‌ప‌డింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటం ఏర్పాటులో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు క‌మిటీలో మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ కమిటీ సమావేశానికి వైఎస్‌ఆర్‌సిపి నుండి నామినేట్‌ అయిన సభ్యులెవ్వరూ హాజరు కాలేదు. సమావేశంలో పాల్గొన్నవారిలో అధికశాతం మంది బహిరంగ లేఖ రాయడం సమంజసం కాదని, దానికి బదులుగా స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేసి ఉండవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బహిరంగ లేఖ రాయడం స్పీకర్‌ స్థానానికి ఉన్న గౌరవభావాన్ని తగ్గిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అసెంబ్లీ ప్రాంగణంలో ఏ ముఖ్యమంత్రి చిత్రపటాన్ని పెట్టలేదని, తమ పార్టీ నేత ఎన్‌ టి రామారావు చిత్రపటాన్ని కూడా టిడిఎల్‌ పి కార్యాలయంలోనే ఏర్పాటు చేసుకున్నామని టిడిపి శాసనసభ్యులు అసెంబ్లీ సాధారణ వ్య‌వ‌హారాల కమిటీకి చెప్పారు. అదే విధంగా రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని కూడా ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం సమంజసమని సూచించారు. రాజశేఖరరెడ్డి చిత్రపటం చీల ఊడిపోవడం, రిపేరుకు రావడం వల్ల స్పీకరుకు తెలిపి దానిని పక్కన తీసి భద్రపరచినట్లు అసెంబ్లీ సెక్రటరీ కమిటీకి చెప్పారు. దీనికి సంబంధించిన పూర్వాపరాలను కమిటీ పరిశీలించింది. ఈ చిత్రపటాన్ని ఏర్పాటు చేసేందుకు 2010 జూలై 8న అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో ఒక బులెటిన్‌ను మాత్రమే విడుదల చేశా రని కమిటీ సమావేశంలో తేలింది. ఇటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేయడానికి సాధారణ వ్యవహారాల కమిటీ అనుమతి లేకుండా , అసెంబ్లీ లో ప్రకటన చేయకుండా .. బులెటిన్‌ విడుదల చేయడంపై ఆనాడే సభలో తెలుగుదేశం అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఆ తర్వాత ఆనాటి సిఎం రోశయ్య కూడా ఈ అంశంపై తాను ఎటువంటి తీర్మానాన్ని చేయడం లేదని సభలో ప్రకటించారు. అందువల్ల చిత్రపటం ఏర్పాటు నిబంధనల ప్రకారం జరగలేదని భావించాలని సాధారణ వ్యవహారాల కమిటీ సభ్యులు అభిప్రాయపడినట్లు సమాచారం. క‌మిటీ త‌మ అభిప్రాయాల‌ను స్ప‌ష్టంగా వ్య‌క్తీక‌రించినందున‌ ఇక ఇక్క‌డితో ఈ స‌మ‌స్య పూర్త‌యిన‌ట్లు ప‌రిగ‌ణించాల‌ని స్పీక‌ర్ కార్యాల‌యం భావిస్తోంది. అయితే వైఎస్ చిత్ర‌ప‌టాన్ని య‌థాస్థానంలో ఉంచేవ‌ర‌కు తాము పోరాటం చేస్తామ‌ని, అసెంబ్లీలోనూ ఈ అంశాన్ని లేవ‌నెత్తుతామ‌ని వైఎస్ఆర్‌సీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఈ వివాదం ఇంకా ఎన్ని మ‌లుపులు తీసుకుంటుందో చూడాలి.
First Published:  12 Aug 2015 12:06 AM GMT
Next Story