Telugu Global
Others

నిజమైన "పోకిరీ" సినిమా...

పోకిరి సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఒంటరిగా ఉన్న తల్లీకూతుళ్ళను వేధిస్తుంటాడు. కూతుర్ని ఉంచుకుంటానని తల్లిపై ఒత్తిడి తెస్తాడు. తెరమీది ఈ సంఘటన మేడ్చల్‌లో నిజంగా జరిగింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ మేడ్చల్‌కు చెందిన భార్యభర్త, పిల్లలు షిర్డీ వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు మార్గమధ్యంలో ఒక స్టేషన్‌లో రైలుదిగిన భర్త‌ మళ్ళీ ఎక్కలేక పోయాడు. తిరిగి ఇంటికీ చేరుకోలేదు. భర్త ఏమయ్యాడోనని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు బాధ్యతని పోలీసులు ఎస్.ఐ. సతీష్ కుమార్‌కు […]

నిజమైన పోకిరీ సినిమా...
X

పోకిరి సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఒంటరిగా ఉన్న తల్లీకూతుళ్ళను వేధిస్తుంటాడు. కూతుర్ని ఉంచుకుంటానని తల్లిపై ఒత్తిడి తెస్తాడు.

తెరమీది ఈ సంఘటన మేడ్చల్‌లో నిజంగా జరిగింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ మేడ్చల్‌కు చెందిన భార్యభర్త, పిల్లలు షిర్డీ వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు మార్గమధ్యంలో ఒక స్టేషన్‌లో రైలుదిగిన భర్త‌ మళ్ళీ ఎక్కలేక పోయాడు. తిరిగి ఇంటికీ చేరుకోలేదు. భర్త ఏమయ్యాడోనని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు బాధ్యతని పోలీసులు ఎస్.ఐ. సతీష్ కుమార్‌కు అప్పగించారు.

తల్లీకూతుళ్ళని చూసిన పోకిరీ ఎస్.ఐ లైంగిక వేధింపులు మొదలు పెట్టాడు. ఫోన్లలో అసభ్యంగా మాట్లాడేవాడు. ఆ సంభాషణలను రికార్డు చేసిన తల్లీకూతుళ్ళు పైఅధికారులకు ఫిర్యాదు చేశారు. శాఖాపరమైన విచారణ జరిపిన పోలీసులు లైంగిక వేధింపులు నిజమేనని నిర్ధారించి ఎస్.ఐ సతీష్ కుమార్‌ని నిర్భయ చట్టం క్రింద అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు పంపించారు. కొసమెరుపు ఏమిటంటే ఈ ఎస్.ఐ ‘షీ’ టీంలో సభ్యుడు కావడం…

First Published:  12 Aug 2015 1:41 AM GMT
Next Story