Telugu Global
Others

రాధేమాపై చేత‌బడి కేసు!

వివాదాస్ప‌ద సాథ్వి రాధే మాపై చేత‌బ‌డి కేసు న‌మోదు చేయ‌బోతున్నారు ముంబై పోలీసులు. మూఢ న‌మ్మ‌కాల‌ను ప్ర‌మోట్ చేస్తోందంటూ ముంబైలోని బోరివ‌లీ పోలీస్ స్టేష‌న్‌లో ఆమెపై ఫిర్యాదు అందింది. మూఢ‌న‌మ్మ‌కాల వ్య‌తిరేక చ‌ట్టంకింద ఆమెపై కేసు న‌మోదుచేయాల‌ని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. విచిత్ర ప్ర‌వ‌ర్త‌న‌తో చేష్ట‌ల‌తో త‌న‌కు అతీంద్రియ శ‌క్తులున్నాయంటూ రాధే మా త‌మ‌ను వేధించింద‌ని ఫిర్యాదు చేశారు. ఇప్ప‌టికే ఆమెపై వ‌ర‌క‌ట్న వేధింపులు కేసుతోటు అశ్లీల‌త‌, చీటింగ్ కేసులు కూడా న‌మోద‌య్యాయి. త‌న ఆశ్ర‌మంలో ఏం చేసినా […]

రాధేమాపై చేత‌బడి కేసు!
X

వివాదాస్ప‌ద సాథ్వి రాధే మాపై చేత‌బ‌డి కేసు న‌మోదు చేయ‌బోతున్నారు ముంబై పోలీసులు. మూఢ న‌మ్మ‌కాల‌ను ప్ర‌మోట్ చేస్తోందంటూ ముంబైలోని బోరివ‌లీ పోలీస్ స్టేష‌న్‌లో ఆమెపై ఫిర్యాదు అందింది. మూఢ‌న‌మ్మ‌కాల వ్య‌తిరేక చ‌ట్టంకింద ఆమెపై కేసు న‌మోదుచేయాల‌ని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. విచిత్ర ప్ర‌వ‌ర్త‌న‌తో చేష్ట‌ల‌తో త‌న‌కు అతీంద్రియ శ‌క్తులున్నాయంటూ రాధే మా త‌మ‌ను వేధించింద‌ని ఫిర్యాదు చేశారు. ఇప్ప‌టికే ఆమెపై వ‌ర‌క‌ట్న వేధింపులు కేసుతోటు అశ్లీల‌త‌, చీటింగ్ కేసులు కూడా న‌మోద‌య్యాయి.

త‌న ఆశ్ర‌మంలో ఏం చేసినా త‌ప్పులేద‌నీ చెబుతారు రాధేమా!
ఆశ్ర‌మాన్ని క్యాబ‌రేకి దిగ‌జార్చింద‌ని ఆమెపై విమ‌ర్శ‌లున్నాయి. రాధేమా ఆశ్రమంలో అశ్లీల నృత్యాలు..ఆమెను భ‌క్తులు ఎత్తుకోవ‌డం., భ‌క్తుల్ని ఆమె ఎత్తుకోవ‌డం..ముద్దులు పెట్టుకోవ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని పూర్వ భ‌క్తురాలైన న్యాయ‌వాది విమ‌ర్శిస్తున్నారు. ఆ పైత్యాన్ని భ‌రించ‌లేక ఆమె రాధేమాపై కేసు పెట్టారు. భ‌క్తి ముసుగులో వంద‌ల కోట్లు గ‌డించింద‌నీ., ల్యాండ్ సెటిల్మెంట్లు చేసేద‌నీ, మినీ స్క‌ర్ట్‌ల‌తో అసంభ్యంగా ప్ర‌వ‌ర్తిస్తుంద‌ని రాధేమాపై ఆరోప‌ణ‌లున్నాయి.

First Published:  13 Aug 2015 3:10 AM GMT
Next Story