Telugu Global
Others

బాబు పాలనలో వీళ్ళదే పెత్తనం..!

ఈ ఫోటో చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఎవరో నేరస్తుణ్ణి ఒక పెద్ద పోలీసు అధికారి ప్రశ్నిస్తున్నట్లు ఉంది కదూ..! మీ అంచనా నిజం కాదు. ఆయన పోలీసు డీజీపి కాదు… ఒక సాధారణ సీఐ. ఎదురుగా నిలబడ్డ వ్యక్తి ఒక నేరస్తుడు కాదు. ఒక గౌరవనీయమైన మాజీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్‌ సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు. చంద్రబాబు పాలనలో పోలీసులదే రాజ్యంలా అనిపిస్తోంది. ఒక పుష్కరం క్రితం దేవేందర్‌గౌడ్‌ హోంమంత్రిగా ఉన్నప్పుడు పోలీసుల గురించి చేసిన […]

బాబు పాలనలో వీళ్ళదే పెత్తనం..!
X

ఈ ఫోటో చూస్తుంటే మీకేమనిపిస్తుంది?
ఎవరో నేరస్తుణ్ణి ఒక పెద్ద పోలీసు అధికారి ప్రశ్నిస్తున్నట్లు ఉంది కదూ..!
మీ అంచనా నిజం కాదు. ఆయన పోలీసు డీజీపి కాదు… ఒక సాధారణ సీఐ.
ఎదురుగా నిలబడ్డ వ్యక్తి ఒక నేరస్తుడు కాదు.
ఒక గౌరవనీయమైన మాజీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్‌ సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు.
చంద్రబాబు పాలనలో పోలీసులదే రాజ్యంలా అనిపిస్తోంది.
ఒక పుష్కరం క్రితం దేవేందర్‌గౌడ్‌ హోంమంత్రిగా ఉన్నప్పుడు పోలీసుల గురించి చేసిన కామెంట్‌ ఇప్పుడు గుర్తుకొస్తోందా?
గుర్తుకు రాకపోతే, అప్పుడు దేవేందర్‌గౌడ్‌ ఏమన్నాడంటే కొందరు పోలీసులు పోలీస్‌స్టేషన్‌ని తమ రాజ్యంగా, తామో నియంతల్లాగా ఊహించుకుంటున్నారని, వాళ్ళముందు పౌరులు కుర్చీలో కూర్చోవడం కూడా అవమానంగా భావిస్తున్నారని, నేను హోంమినిస్టర్‌ని కాకపోతే పోలీస్‌స్టేషన్‌లో నేను కుర్చీలో కూర్చోవడం కూడా ఇబ్బందిగా ఫీలయ్యేవారని అన్నాడు.
ఈ సన్నివేశం చూస్తే అదే చంద్రబాబు పాలన, అదే పోలీసుల ప్రవర్తన అనిపిస్తోంది కదా..!

Also Read
ఉద్యమాలపై బాబు ప్రభుత్వం ఉక్కుపాదం

First Published:  13 Aug 2015 12:19 AM GMT
Next Story