మళ్లీ తెరపైకి జెనీలియా

దాదాపు  మూడేళ్ల పాటు వెండితెరకు దూరమైంది జెనీలియా. బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా పేరుతెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లాడి సినిమాలకు దూరమైంది. వీళ్లిద్దరికీ ఓ బాబు కూడా పుట్టాడు. ఇన్నాళ్లూ కుటుంబ వ్యవహారాలతో బిజీగా గడిపిన జెనీలియా ఇప్పుడు మళ్లీ ముఖానికి రంగేసుకోవాలనుకుంటోంది. బాబుకు ఏడాది వయసు దాటిపోవడంతో.. ఇకపై తను నిరభ్యంతరంగా సినిమాల్లో నటించొచ్చని అంటోంది. మరోవైపు భర్త రితేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మళ్లీ తన పాత కాంటాక్ట్స్ అన్నీ తిరగదోడుతోంది. ఇందులో భాగంగా మొదట యాడ్స్ తో తన రీఎంట్రీని షురూ చేస్తోంది జెనీలియా. ఓ కమర్షియల్ యాడ్ లో నటించేందుకు ఒప్పుకుంది. త్వరలోనే ఓ హిందీ సినిమాతో పాటు.. మంచి కథ దొరికితే సైమల్టేనియస్ గా తెలుగులో కూడా నటిస్తానని ప్రకటించింది. మరి రీఎంట్రీలో ఆమెకు మన తెలుగు దర్శకులు ఎలాంటి పాత్రలు ఆఫర్ చేస్తారో చూడాలి. హిందీలో అంటే పెళ్లయిపోయినా హీరోయిన్ పాత్రలు చేయొచ్చు.. కానీ తెలుగులో అలా కుదరదుకాబట్టి.. ఆమె రీఎంట్రీ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందర్లో ఉంది.