Telugu Global
Others

గూగుల్‌ సీఈఓ జీతం నెలకు రూ. 26 కోట్లు!

తమిళనాడులో పుట్టి ప్రస్తుతం గూగుల్‌ సీఈఓగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సుందర్‌ పిచాయ్‌ జీతం నెలకు 26 కోట్ల రూపాయలు. పుష్కరం క్రితం సాధారణ ఉద్యోగిగా చేరిన పిచాయ్ అంచలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం గూగుల్ సిఇఓగా నియమితులయ్యారు. గూగుల్‌ క్రోమ్‌, గూగుల్‌ మ్యాప్స్, గూగుల్‌ స్టోర్స్‌, ఆండ్రాయిడ్‌ అప్లికేషన్లతోపాటు మరిన్ని అప్లికేషన్లలో సుందర్ కీలక పాత్ర పోషించారు. అయితే సిఇఓగా ఉన్న సుందర్ భారత కరెన్సీ ప్రకారం సంవత్సరానికి 310 కోట్ల రూపాయల ప్యాకేజీని సుందర్‌ పిచాయ్‌ […]

తమిళనాడులో పుట్టి ప్రస్తుతం గూగుల్‌ సీఈఓగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సుందర్‌ పిచాయ్‌ జీతం నెలకు 26 కోట్ల రూపాయలు. పుష్కరం క్రితం సాధారణ ఉద్యోగిగా చేరిన పిచాయ్ అంచలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం గూగుల్ సిఇఓగా నియమితులయ్యారు. గూగుల్‌ క్రోమ్‌, గూగుల్‌ మ్యాప్స్, గూగుల్‌ స్టోర్స్‌, ఆండ్రాయిడ్‌ అప్లికేషన్లతోపాటు మరిన్ని అప్లికేషన్లలో సుందర్ కీలక పాత్ర పోషించారు. అయితే సిఇఓగా ఉన్న సుందర్ భారత కరెన్సీ ప్రకారం సంవత్సరానికి 310 కోట్ల రూపాయల ప్యాకేజీని సుందర్‌ పిచాయ్‌ అందుకోనున్నట్లు తెలిసింది. దీన్నిబట్టి చూస్తే ప్రతినెలా దాదాపు 25.8 కోట్ల రూపాయల వేతనం పొందనున్నాడన్న మాట. గ్రేట్ అచీవ్‌మెంట్‌ కదా!
First Published:  12 Aug 2015 1:28 PM GMT
Next Story