Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 173

వాడకం “మీ ఇంట్లో అంతా కారుని ఎలా వాడతారు?” “ఎవరి టర్న్‌ బట్టి వాళ్లు వాడతారు.” “అంటే???” “షాపింగ్‌కి మా ఆవిడ, సినిమాలకి, షికార్లకి మా పిల్లలు, రిపేరు వచ్చినపుడు నేను!!!” ——————————————————————– మనశ్శాంతి “మనషులందరూ మనశ్శాంతితో బతికే మార్గమేంటో సెలవియ్యండి స్వామీ” భక్తిగా అడిగాడు శిష్యుడు. “శుంఠా! ఇలాంటి తలతిక్క ప్రశ్నలు వేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకు. ఆ మార్గమేదో సెలవిస్తే ఇక మన దగ్గరకు ఎవడొస్తాడు?!!” ——————————————————————– ప్రశాంతత “పెళ్ళయి 50 ఏళ్లు కాపురం […]

వాడకం
“మీ ఇంట్లో అంతా కారుని ఎలా వాడతారు?”
“ఎవరి టర్న్‌ బట్టి వాళ్లు వాడతారు.”
“అంటే???”
“షాపింగ్‌కి మా ఆవిడ, సినిమాలకి, షికార్లకి మా పిల్లలు, రిపేరు వచ్చినపుడు నేను!!!”
——————————————————————–
మనశ్శాంతి
“మనషులందరూ మనశ్శాంతితో బతికే మార్గమేంటో సెలవియ్యండి స్వామీ” భక్తిగా అడిగాడు శిష్యుడు.
“శుంఠా! ఇలాంటి తలతిక్క ప్రశ్నలు వేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకు. ఆ మార్గమేదో సెలవిస్తే ఇక మన దగ్గరకు ఎవడొస్తాడు?!!”

——————————————————————–
ప్రశాంతత
“పెళ్ళయి 50 ఏళ్లు కాపురం చేసిన తర్వాత ఇపుడెందుకు విడాకులడుగుతున్నారు.?” ఆశ్చర్యంగా అడిగాడు జడ్జి.
“చివరి కాలంలో అయినా ప్రశాంతంగా బ్రతుకుదామని!!!” తాపీగా చెప్పాడు నాగయ్య.
——————————————————————–
అబద్ధాలు
“మగవాళ్ళు అబద్ధాలు చెప్పడానికే పుట్టారు!”
“మరి ఆడవాళ్ళు?”
“వాటిని నమ్మడానికే పుట్టారు!”

First Published:  12 Aug 2015 1:03 PM GMT
Next Story