Telugu Global
Others

ఓటుకు నోటు నువ్వా-నేనా!

ఓటుకు నోటు కేసులో బుధ‌వారం ప‌లు ఆస‌క్తిక‌ర మ‌లుపులు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ఇప్ప‌టికే జిమ్మిబాబు అరెస్టుకు తెలంగాణ ఏసీబీ రంగం సిద్ధం చేసుకుంది. అదే ఊపుతో లోకేష్ డ్రైవ‌ర్ కొండ‌ల్‌రెడ్డికి ఏసీబీ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. ఇందుకోసం చంద్ర‌బాబు నివాసానికి ఏసీబీ కానిస్టేబుళ్లు వెళ్లారు. దీంతో ఏపీ పోలీసులు తామేం త‌క్కువ తిన‌లేద‌న్న‌ట్లుగా ప్ర‌తిగా తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, ఐటీ శాఖ‌మంత్రి కేటీఆర్ డ్రైవ‌ర్ కు, గ‌న్‌మెన్ల‌కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వ‌డంతో రెండు […]

ఓటుకు నోటు నువ్వా-నేనా!
X

ఓటుకు నోటు కేసులో బుధ‌వారం ప‌లు ఆస‌క్తిక‌ర మ‌లుపులు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ఇప్ప‌టికే జిమ్మిబాబు అరెస్టుకు తెలంగాణ ఏసీబీ రంగం సిద్ధం చేసుకుంది. అదే ఊపుతో లోకేష్ డ్రైవ‌ర్ కొండ‌ల్‌రెడ్డికి ఏసీబీ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. ఇందుకోసం చంద్ర‌బాబు నివాసానికి ఏసీబీ కానిస్టేబుళ్లు వెళ్లారు. దీంతో ఏపీ పోలీసులు తామేం త‌క్కువ తిన‌లేద‌న్న‌ట్లుగా ప్ర‌తిగా తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, ఐటీ శాఖ‌మంత్రి కేటీఆర్ డ్రైవ‌ర్ కు, గ‌న్‌మెన్ల‌కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వ‌డంతో రెండు రాష్ట్రాల్లో ఈ కేసు మ‌రోసారి వేడి రాజేసింది. ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్ రూ. 50 ల‌క్ష‌ల‌తో కొనుగొలుకు ప్ర‌య‌త్నించిన రేవంత్‌రెడ్డి ఏసీబీ ఎదుట అడ్డంగా దొరికిన విష‌యం విదిత‌మే. వారం వ్య‌వ‌ధిలో ఈ కేసులో అస‌లు సూత్ర‌ధారి చంద్ర‌బాబే అని కేసీఆర్ ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. వెనువెంట‌నే చంద్ర‌బాబు-స్టీఫెన్ స‌న్‌తో మాట్లాడిన ఆడియోలు వెలుగు చూడ‌టం ప్ర‌పంచం నివ్వెర‌పోయింది. దీంతో ఏపీ ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు దిగింది. కేసులో నిందితుడిగా ఉన్న‌ మ‌త్త‌య్య ఏపీకి పారిపోయాడు. అక్కడ తెలంగాణ‌ సీఎంపై ఫిర్యాదు చేయ‌గానే ఏపీ పోలీసులు ఎక్క‌డ‌లేని అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి కేసు న‌మోదుచేశారు. మీడియా ప్ర‌శ్నిస్తే మ‌త్త‌య్య నిందితుడ‌న్న స‌మాచారం తమవద్ద‌ లేద‌ని కొత్త‌ప‌ల్ల‌వి అందుకున్నారు. అత‌నిని కాపాడేందుకు పేరు మోసిన లాయ‌ర్లు రంగంలోకి దిగ‌డం విశేషం.

ప్ర‌తీకారంగానే కేటీఆర్‌కు నోటీసులు!

రేవంత్‌రెడ్డి స్టీఫెన్‌స‌న్‌కు ఎర‌చూపిన డ‌బ్బులు ర‌వాణా చేయ‌డంలో లోకేష్ డ్రైవ‌ర్ కొండ‌ల్‌రెడ్డి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు ఏసీబీ వ‌ద్ద స‌మాచారం ఉంద‌ని అందుకే నోటీసులు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఓటుకు నోటు కేసులో ఏ-4 నిందితుడు మ‌త్త‌య్య ఫిర్యాదు ఇచ్చాడంటూ తాజాగా కేటీఆర్ డ్రైవ‌ర్, గ‌న్‌మెన్ల‌కు నోటీసులు జారీ చేసేందుకు ఏపీ సీఐడీ పోలీసులు హైద‌రాబాద్ వ‌చ్చారు. వారె చెప్పిన పేర్ల‌తో కేటీఆర్ ఇంటి వ‌ద్ద గానీ, తెలంగాణ స‌చివాల‌యంలోగానీ ఎలాంటి వ్య‌క్తులు ప‌నిచేయ‌డం లేద‌న్న స‌మాధానం ఎదుర‌వ‌డంతో విజ‌య‌వాడ డీఎస్సీ షావ‌లి, విశాఖ‌ప‌ట్నం సీఐడీ ఇన్ స్పెక్ట‌ర్ వెనుదిరిగారు. గ‌తంలో టీ-న్యూస్ కార్యాల‌యానికి వెళ్లిన ఏపీ పోలీసులు నిబంధ‌న‌లకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. తాజాగా లోకేశ్ డ్రైవ‌ర్‌కు నోటీసులు జారీ చేసిన గంట‌ల వ్య‌వ‌ధిలో కేటీఆర్ డ్రైవ‌ర్‌కు నోటీసులు జారీచేసే ప్రయత్నంపై తెరాస మండిప‌డుతోంది. త‌ప్పుచేసిన ప్ర‌భుత్వాలు పోలీసుల‌ను ఇష్టానుసారంగా వినియోగించుకుంటున్న వైనం చ‌రిత్ర‌లో ఎక్క‌డా లేదని ప్రజలు వాపోతున్నారు. చంద్ర‌బాబు తీరుపై సర్వత్ర నిరసన వ్యక్తమవుతుంది.

First Published:  12 Aug 2015 9:11 PM GMT
Next Story