Telugu Global
Others

మ్యాగీ నూడిల్స్‌కు క్లీన్‌ చిట్‌

నెస్లే సంస్థ ఉత్పత్తి చేసే మ్యాగీ నూడిల్స్‌ను భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు నిషేధిస్తే, అమెరికా క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. అమెరికాలో పరీక్షించిన నూడిల్స్‌లో సీసం శాతం అనుమతులకు లోబడే ఉందని అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ విభాగం ప్రకటించింది. ఇది నిజమే! అమెరికా ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఎలాంటి పదార్ధాలకు అమెరికా అనుమతినివ్వదు. అందుకే అమెరికా నుంచి వచ్చిన మనవాళ్ళు అమెరికన్‌, యూరోపియన్‌ ఉత్పత్తులపట్ల తెగ అభిమానం ప్రదర్శిస్తారు. కోకోకోలా, కెంటకీ చికెన్‌, మ్యాగీ…. ఇలాంటివి […]

మ్యాగీ నూడిల్స్‌కు క్లీన్‌ చిట్‌
X

నెస్లే సంస్థ ఉత్పత్తి చేసే మ్యాగీ నూడిల్స్‌ను భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు నిషేధిస్తే, అమెరికా క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. అమెరికాలో పరీక్షించిన నూడిల్స్‌లో సీసం శాతం అనుమతులకు లోబడే ఉందని అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ విభాగం ప్రకటించింది.
ఇది నిజమే! అమెరికా ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఎలాంటి పదార్ధాలకు అమెరికా అనుమతినివ్వదు. అందుకే అమెరికా నుంచి వచ్చిన మనవాళ్ళు అమెరికన్‌, యూరోపియన్‌ ఉత్పత్తులపట్ల తెగ అభిమానం ప్రదర్శిస్తారు. కోకోకోలా, కెంటకీ చికెన్‌, మ్యాగీ…. ఇలాంటివి ఏవైనా విదేశాలు తిరిగివచ్చిన వాళ్ళు తెగ అభిమానిస్తారు. వాటిని నిషేధించడం ఎందుకని ప్రశ్నిస్తారు.
అసలు విషయం ఏమిటంటే కోకోకోలా అయినా, కెంటకీ చికెన్‌ అయినా, మ్యాగీ నూడిల్స్‌ అయినా అమెరికా, యూరప్‌లో ఒళ్ళు దగ్గరపెట్టుకుని జాగ్రత్తగా, ఆరోగ్యకరంగా తయారుచేసి మార్కెట్‌కు పంపుతారు.
అదే మన ఇండియా, మూడో ప్రపంచ దేశాలంటే వాళ్ళకు అలుసు. ఎలా తయారుచేసినా అడిగేదెవరన్న అహంకారం. వాళ్ళదయకోసం ఆయాదేశాల ముందు సేవకుల్లా, వినయంగా పడివుంటే మన నేతలు ఏం చేస్తారన్న ధైర్యం. పైసలు పడేస్తే మన అధికారులు వాళ్ళముందు వంది మాగధుల్లా పడి ఉంటారన్న నమ్మకం.. అందుకే ఇక్కడ తయారయ్యే వాళ్ళ ఉత్పత్తులు నాసిరకంగా ఉంటాయి. ఆరోగ్యానికి ప్రమాదకరంగా ఉంటాయి. ఇక్కడ తయారయ్యే వాళ్ళ ఉత్పత్తుల్ని తీసుకువెళ్ళి, వాళ్ళ ల్యాబ్‌లలో పరీక్షించమనండి. అప్పుడు తెలుస్తుంది!
అయినా మన భ్రమకానీ, ఈ విషయాలు వాళ్ళకు తెలియవంటారా?

First Published:  13 Aug 2015 1:16 AM GMT
Next Story