Telugu Global
Cinema & Entertainment

 సైజ్ జీరోతో కేక పుట్టించింది

బాహుబలి సినిమా ప్రమోషన్ నుంచి విడుదల వరకు అనుష్క ఎక్కడా కనిపించలేదు. రాజమౌళికి, అనుష్కకు చెడిందని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ తన కొత్త సినిమా సైజ్ జీరో కోసం అనుష్క భారీగా ఒళ్లుపెంచింది కాబట్టే.. బాహుబలి ప్రమోషన్ లో పాలుపంచుకోలేదని అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. అది ఇప్పుడు నిజమైంది. సైజ్ జీరో సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ చూసినోళ్లంతా షాక్. అనుష్క బాగా లావుగా కనిపించి అదరగొట్టేసింది. ఓ వైపు ఆర్య.. […]

 సైజ్ జీరోతో కేక పుట్టించింది
X
బాహుబలి సినిమా ప్రమోషన్ నుంచి విడుదల వరకు అనుష్క ఎక్కడా కనిపించలేదు. రాజమౌళికి, అనుష్కకు చెడిందని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ తన కొత్త సినిమా సైజ్ జీరో కోసం అనుష్క భారీగా ఒళ్లుపెంచింది కాబట్టే.. బాహుబలి ప్రమోషన్ లో పాలుపంచుకోలేదని అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. అది ఇప్పుడు నిజమైంది. సైజ్ జీరో సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ చూసినోళ్లంతా షాక్. అనుష్క బాగా లావుగా కనిపించి అదరగొట్టేసింది. ఓ వైపు ఆర్య.. మరోవైపు అనుష్క. ఇలా ఒకేఒక్క స్టిల్ తో సైజ్ జీరో టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారిపోయింది. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ రావు ఈ సైజీ జీరోను దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ లుక్ చూసినవెంటనే సమంత షాక్ అయింది. వావ్.. అనుష్క అక్కయ్య ఏంటి ఇలా మారిపోయిందంటూ మెచ్చుకుంది. హీరోయిన్లంతా అందంగానే కాదు.. ఇలా కూడా కనిపించి నటనతో రాణించవచ్చంటూ ట్వీట్ చేసింది. మరింత మంది సినీప్రముఖులు సైజ్ జీరోను మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగు-తమిళ భాషల్లో పీవీపీ సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది.
First Published:  14 Aug 2015 11:31 AM GMT
Next Story