Telugu Global
Others

భూములు లాక్కుంటే ఒప్పుకోం: సీపీఏం

ఆంధ్రప్రదేశ్‌కి ప్రజా రాజధాని కావాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో పేదల పొలాలు లాక్కుంటే సహించేది లేదని హెచ్చరించారు. తమకు న్యాయం చేయాలని అడుగుతున్న రైతు కూలీలపై, శ్రామికులకు అండగా నిలుస్తున్న వామపక్షాలపై ఏపీ ప్రభుత్వం నిర్ధాక్ష్యిణ్యంగా వ్యవరిస్తోందని నేతలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ… రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం చేతకాని ప్రభుత్వం వారి భూములను ఎలా తీసుకుంటుందని మండిపడ్డారు. పేదల […]

భూములు లాక్కుంటే ఒప్పుకోం: సీపీఏం
X

ఆంధ్రప్రదేశ్‌కి ప్రజా రాజధాని కావాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో పేదల పొలాలు లాక్కుంటే సహించేది లేదని హెచ్చరించారు. తమకు న్యాయం చేయాలని అడుగుతున్న రైతు కూలీలపై, శ్రామికులకు అండగా నిలుస్తున్న వామపక్షాలపై ఏపీ ప్రభుత్వం నిర్ధాక్ష్యిణ్యంగా వ్యవరిస్తోందని నేతలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ… రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం చేతకాని ప్రభుత్వం వారి భూములను ఎలా తీసుకుంటుందని మండిపడ్డారు. పేదల సమస్యలు తేల్చకపోతే… ప్రభుత్వం అక్టోబర్ 22న తలపెట్టిన ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీ, సింగపూర్ ప్రతినిధుల బృందం వస్తే.. వారిని అడ్డుకుని నిలదీస్తామని హెచ్చరించారు. పేద ప్రజలకు తమపార్టీ అండగా ఉంటుందని, ప్రజలు చేసే పోరాటాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. విజయవాడలో జరుగుతున్న సీఆర్‌డీఏ సమావేశాన్ని నిరసిస్తూ గుంటూరు జిల్లా తుళ్లూరులో సీపీఎం ధర్నా నిర్వహించింది.

First Published:  14 Aug 2015 6:54 AM GMT
Next Story