Telugu Global
NEWS

లేడీస్ హాస్ట‌ల్లో పురుషులా?

 బీటెక్ విద్యార్థిని రిషితేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య నేప‌థ్యంలో ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీలో నిర్వ‌హ‌ణ‌లోపాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇటీవ‌ల ఇన్‌ఛార్జి వీసీగా నియ‌మితులైన విజ‌య‌ల‌క్ష్మి ఇక్క‌డ ప‌ర్య‌టించారు. లేడీస్ హాస్ట‌ల్లో పురుషులు ఉండ‌టం చూసి ఆవిడ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మీకు ఇక్క‌డ ప‌ని చేయ‌డానికి ఆడ‌మ‌నుషులే దొర‌క‌లేదా? అని అధికారుల‌పై మండిప‌డ్డారు. హాస్ట‌ల్‌లోని వివిధ వార్డుల్లో ప‌ర్య‌టించారు. మెస్‌లోకి వెళ్లి భోజ‌నం ఎలా ఉంద‌ని అక్క‌డ విద్యార్థుల‌ను అడిగి తెలుసుకున్నారు. త‌మకు పెట్టే భోజ‌నం బాగోలేద‌ని, త‌మ […]

లేడీస్ హాస్ట‌ల్లో పురుషులా?
X
బీటెక్ విద్యార్థిని రిషితేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య నేప‌థ్యంలో ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీలో నిర్వ‌హ‌ణ‌లోపాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇటీవ‌ల ఇన్‌ఛార్జి వీసీగా నియ‌మితులైన విజ‌య‌ల‌క్ష్మి ఇక్క‌డ ప‌ర్య‌టించారు. లేడీస్ హాస్ట‌ల్లో పురుషులు ఉండ‌టం చూసి ఆవిడ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మీకు ఇక్క‌డ ప‌ని చేయ‌డానికి ఆడ‌మ‌నుషులే దొర‌క‌లేదా? అని అధికారుల‌పై మండిప‌డ్డారు. హాస్ట‌ల్‌లోని వివిధ వార్డుల్లో ప‌ర్య‌టించారు. మెస్‌లోకి వెళ్లి భోజ‌నం ఎలా ఉంద‌ని అక్క‌డ విద్యార్థుల‌ను అడిగి తెలుసుకున్నారు. త‌మకు పెట్టే భోజ‌నం బాగోలేద‌ని, త‌మ కంటే ముందు సిబ్బందే తింటున్నార‌ని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. వార్డెన్ కూడా విద్యార్థులు చెప్పేది నిజ‌మేన‌ని స‌మ‌ర్థించారు. వెంట‌నే సిబ్బందిని పిలిచి హెచ్చ‌రించారు. ప‌రిస్థితుల్లో మార్పు రాక‌పోతే సస్పెండ్ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. హాస్ట‌ల్‌ సూప‌ర్‌వైజ‌ర్ తీరుపైనా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమ్మాయిల వ‌స‌తి గృహాల‌లో ప‌నిచేస్తున్న మగవారిని వెంట‌నే బ‌దిలీ చేయాల‌ని రిజిస్ట్రార్‌కు సూచించారు.
First Published:  14 Aug 2015 12:31 AM GMT
Next Story