Telugu Global
Cinema & Entertainment

షోలే కు అప్పుడే 40 ఏళ్లా..!

భార‌తీయ సినిమాను   స్ట‌డి చేస్తే.. షోలేకు ముందు.. షోలేకు త‌రువాత  అని   చెప్పుకోవాల్సిందే.  ఎందుకంటే..  ఇండియ‌న్ సిల్వ‌ర్ స్క్రీన్  ముఖ చిత్రాన్ని  డైరెక్ట‌ర్ ర‌మేష్ సిప్పి..  ర‌చ‌యిత‌లు   స‌లీం – జావేద్ లు షోలో చిత్రంతో   మార్చేశారు.  1975 ఆగ‌ష్టు 15న  విడుద‌లైన ఈ చిత్రం  ఇండియ‌న్ సినిమాకు   కొత్త ఆక్సిజ‌న్ ఇచ్చింది.  అప్ప‌టి  వ‌ర‌కు  వున్న  మూస దోర‌ణిని  బ్రేక్ చేసి..  హీరోయిజం , విల‌నిజం,  యాక్ష‌న్ , […]

షోలే కు అప్పుడే 40 ఏళ్లా..!
X
భార‌తీయ సినిమాను స్ట‌డి చేస్తే.. షోలేకు ముందు.. షోలేకు త‌రువాత అని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే.. ఇండియ‌న్ సిల్వ‌ర్ స్క్రీన్ ముఖ చిత్రాన్ని డైరెక్ట‌ర్ ర‌మేష్ సిప్పి.. ర‌చ‌యిత‌లు స‌లీం – జావేద్ లు షోలో
చిత్రంతో మార్చేశారు. 1975 ఆగ‌ష్టు 15న విడుద‌లైన ఈ చిత్రం ఇండియ‌న్ సినిమాకు కొత్త ఆక్సిజ‌న్ ఇచ్చింది. అప్ప‌టి వ‌ర‌కు వున్న మూస దోర‌ణిని బ్రేక్ చేసి.. హీరోయిజం , విల‌నిజం, యాక్ష‌న్ , డైలాగ్స్, సినిమాటోగ్ర‌ఫి, ఫైట్స్, ఇలా ఒక్క‌టేమిటి.. సినిమాకు సంబంధించిన ప్ర‌తి విష‌యానికి షోలే చిత్రం ఒక ఎన్ సైక్లోపీడియాగా అయ్యింది.
అరే వో సాంబ అంటూ విల‌న్ ప‌లికిన డైలాగ్ కు భార‌తీయ సినిమా ప్రేక్ష‌కులు స‌రికొత్త అనుభూతిని పొందారు. నిజం చెప్పుకోవాలంటే.. ఇప్ప‌టికి ఇండియ‌న్ సినిమా పై షోలే ప్ర‌భావం ఉంది. గ‌త న‌ల‌భై యేళ్ల నుంచి షోల్ ప్ర‌భావం లేకుండా వ‌చ్చిన చిత్రాలు త‌క్కువ‌నే చెప్పాలి. చిత్ర క‌థ లో లైఫ్ ఉండేలా తీర్చి దిద్ద‌డంతో.. త‌రాలు గ‌డిచిపోతున్నా.. షోలే చిత్రంలో స‌మ‌కాలీన‌త కు వన్నె త‌గ్గ‌లేదు. ఇప్ప‌టి టీనేజి పిల్లలు చూసినా షోలేచిత్రం వారిని ఇంప్రెస్ చేస్తుందనటంలో సందేహమే లేదు. ఇక ఈ చిత్రంలో న‌టించిన అమితాబ‌చ్చ‌న్, ధ‌ర్మేంద్ర‌, హేమా మాలిని, అలాగే సంజీవ్ కుమార్, అంజాద్ ఖాన్ ల కెరీర్ ప‌రంగా వెన‌క్కు చూసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు. ఒక్క వాక్యంలో షోలే గురించి చెప్పాలంటే.. 'షోలే ఈజ్ ది గైడ్ ఫ‌ర్ ఇండియ‌న్ క‌మ‌ర్షియ‌ల్ ఫిల్మ్. ఇంత‌గా భార‌తీయ సినిమా ను ప్ర‌భావితం చేసిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రం మ‌రొక‌టి లేదంటే అతిశ‌యోక్తి కాదు మ‌రి.
First Published:  13 Aug 2015 7:04 PM GMT
Next Story