Telugu Global
Others

తెలుగు రాష్ర్టాల్లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

తెలుగు రాష్ర్టాల్లో 69వ స్వాతంత్య్రదినోత్సవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాడవాడలా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి భరతమాతకు వందనం పలికారు. ఏపీ అసెంబ్లీ ఎదుట స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్‌ మధుసూదనాచారి జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే ఆయా పార్టీ కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. నెల్లూరు జిల్లాలోని స్వర్ణభారతి ట్రస్ట్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం విద్యార్థులకు అబ్దుల్‌ […]

తెలుగు రాష్ర్టాల్లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
X
తెలుగు రాష్ర్టాల్లో 69వ స్వాతంత్య్రదినోత్సవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాడవాడలా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి భరతమాతకు వందనం పలికారు. ఏపీ అసెంబ్లీ ఎదుట స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్‌ మధుసూదనాచారి జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే ఆయా పార్టీ కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. నెల్లూరు జిల్లాలోని స్వర్ణభారతి ట్రస్ట్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం విద్యార్థులకు అబ్దుల్‌ కలాం సూక్తులను వినిపిస్తూ ఉన్నత విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవరుచుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ శాసనమండలిలో చైర్మన్‌ స్వామిగౌడ్‌ త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ భవన్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ జాతీయజెండాను ఎగురవేశారు.
తెలంగాణ బీజేపీ ఆఫీసులో కిషన్‌రెడ్డి జాతీయజెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యేలు, కార్యకర్తలు వేడుకలకు హాజరయ్యారు. మరోవైపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రెండు రాష్ర్టాల్లోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
First Published:  15 Aug 2015 3:08 AM GMT
Next Story