జర నవ్వండి ప్లీజ్ 175

బార్‌
“రోజూ ఇదే బార్‌లో తాగుతావు. వేరే బార్‌కి రమ్మన్నా రావు. ఎందుకని?”
“ఈ బార్‌లో అయితే డోర్‌ డెలివరీ సౌకర్యం ఉంది. తాగి పడిపోయినా జాగ్రత్తగా ఇంటికి చేర్చేస్తారు.”
—————————————————————-
కనపడుట లేదు
“మీ ఆవిడ కనపడుట లేదు అంటూ పేపర్లో ప్రకటించావు సరే, కానీ ఫోటో మాత్రం సరిగా కనిపించకుండా ప్రింట్‌ చేయించావేం?”
“పొరపాటున ఎవరైనా గుర్తుపట్టి ఆచూకి చెప్పేస్తారేమోనని!”
—————————————————————-
పార్టీ
“మీరు కొత్త పార్టీ పెట్టడానికి కారణం?”
“మారడానికి ఇంకే పార్టీ మిగలకపోవడమే”
—————————————————————-
ఇల్లు
“రెండు కిలోమీటర్ల దూరంలో ఇంకో ఇల్లనేది లేని చోట ఓ ఇల్లు అద్దెకి కావాలి!”
“ఎందుకు? మీరు ప్రశాంతంగా ఉందామనుకుంటున్నారా?”
“కాదు. సంగీతం నేర్చుకుందామనుకుంటున్నాను!!!”