Telugu Global
International

అమెరికా టైమ్‌స్క్వేర్‌లో ముద్దుల పండుగ

రెండో ప్రపంచ యుద్ధం అనుభవాలను, విజయాలను తలుచుకుంటూ వందలాది జంటలు న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ వద్ద ముద్దుల్లో మునిగిపోయారు. ఆ యద్ధంలో జపాన్ వెనక్కు తగ్గిన వైనాన్ని గుర్తు చేసుకుంటూ ఒకర్నొకరు ఆలింగనం చేసుకున్నారు. గాఢంగా ముద్దుల్లో మునిగిపోయారు. పురుషులందరూ నావికుల దుస్తుల్లోనూ, మహిళలందరూ తెల్లని వస్త్రాల్లోనూ మెరిసి పోయారు. రెండో ప్రపంచంలో జపాన్‌పై విజయం సాధించగానే ఓ నావికుడు ఆనందంతో రోడ్డుపై తెల్లని దుస్తుల్లో ఉన్న ఓ మహిళను ముద్దాడాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న […]

అమెరికా టైమ్‌స్క్వేర్‌లో ముద్దుల పండుగ
X
రెండో ప్రపంచ యుద్ధం అనుభవాలను, విజయాలను తలుచుకుంటూ వందలాది జంటలు న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ వద్ద ముద్దుల్లో మునిగిపోయారు. ఆ యద్ధంలో జపాన్ వెనక్కు తగ్గిన వైనాన్ని గుర్తు చేసుకుంటూ ఒకర్నొకరు ఆలింగనం చేసుకున్నారు. గాఢంగా ముద్దుల్లో మునిగిపోయారు. పురుషులందరూ నావికుల దుస్తుల్లోనూ, మహిళలందరూ తెల్లని వస్త్రాల్లోనూ మెరిసి పోయారు. రెండో ప్రపంచంలో జపాన్‌పై విజయం సాధించగానే ఓ నావికుడు ఆనందంతో రోడ్డుపై తెల్లని దుస్తుల్లో ఉన్న ఓ మహిళను ముద్దాడాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఓ జర్నలిస్టు ఫోటో తీశాడు. ఇది ‘వి-జె డే ఇన్ టైమ్ స్క్వేర్’గా ప్రసిద్ధి పొందింది. చాలా జంటలు మళ్ళీ దాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ అదే ఫోజులో ముద్దులు పెట్టుకున్నారు. ఆనాటి యుద్ధంలో పాలు పంచుకున్న రే అండ్ ఇల్లీ దంపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ముద్దులు కురిపించే వారికి ప్రేరణగా నిలిచారు.
First Published:  15 Aug 2015 6:03 AM GMT
Next Story