Telugu Global
Others

సీఎం సొంత జిల్లాకే దిక్కులేదు..

అమ్మ‌కు అన్నం పెట్ట‌నివాడు పిన‌త‌ల్లికి వ‌డ్డాణం చేయిస్తాన‌న్నాడ‌ట‌.. అని చంద్ర‌బాబును ఉద్దేశించి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌ర‌చూ ఎద్దేవా చేసేవారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారాచంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా ప‌రిస్థితి చూస్తుంటే ఈ మాట ప‌దేప‌దే గుర్తుకు రాక మాన‌దు. సొంత జిల్లాకు ఏమీ చేయ‌లేని వాడు… ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేసి సింగ‌పూర్ లాంటి రాజ‌ధాని క‌ట్టేస్తాన‌ని క‌బుర్లు చెబుతుండ‌డం విచిత్ర‌మ‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి కూడా.  చిత్తూరు జిల్లా ఇపుడు  క‌రువు కోర‌ల్లో చిక్కుకుని […]

సీఎం సొంత జిల్లాకే దిక్కులేదు..
X
అమ్మ‌కు అన్నం పెట్ట‌నివాడు పిన‌త‌ల్లికి వ‌డ్డాణం చేయిస్తాన‌న్నాడ‌ట‌.. అని చంద్ర‌బాబును ఉద్దేశించి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌ర‌చూ ఎద్దేవా చేసేవారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారాచంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా ప‌రిస్థితి చూస్తుంటే ఈ మాట ప‌దేప‌దే గుర్తుకు రాక మాన‌దు. సొంత జిల్లాకు ఏమీ చేయ‌లేని వాడు… ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేసి సింగ‌పూర్ లాంటి రాజ‌ధాని క‌ట్టేస్తాన‌ని క‌బుర్లు చెబుతుండ‌డం విచిత్ర‌మ‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి కూడా. చిత్తూరు జిల్లా ఇపుడు క‌రువు కోర‌ల్లో చిక్కుకుని అల్లాడుతున్న‌ది. సొంత జిల్లావాడైనా ఆయ‌న త‌మ జిల్లాను అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని చిత్తూరు వాసులు వాపోతున్నారు. చిత్తూరు జిల్లా వాడ‌యినా చిత్తూరుకేమీ చేయ‌న‌ట్లే, ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంకూ చేసిందేమీ లేదు. అలాగే సీమ‌వాసులంతా త‌మ‌వాడేన‌ని అనుకోవ‌డానికీ లేదు. ఎందుకంటే సీమ‌కూ ఆయ‌న ప్ర‌త్యేకంగా చేసిందేమీ లేదు. ఇపుడే కాదు ఆయ‌న గ‌త 9 ఏళ్ల హ‌యాంలోనూ త‌మ ప్రాంతానికి జిల్లాకు, చివ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గానికి ఎలాంటి ప్ర‌యోజ‌నం చేకూర్చ‌లేదు. వ‌ర్త‌మానంలోకి వ‌స్తే… చిత్తూరుజిల్లాలో వ‌ర్షాభావంతో పొలాలన్నీ బీడువారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విత్తిన వేరుశనగ మొలకలు రాకపోగా, మరి కొన్ని ప్రాంతాల్లో వచ్చినవి కూడా ఎండుముఖం పడుతున్నాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మేత లేక పశువులు అంబా అంటూ ఆకలితో అలమటిస్తున్నాయి. రెండు వేలకు పైగా గ్రామాలు దాహంతో అల్లాడుతున్నాయి. ఈ వర్షాకాలంలో కూడా ట్యాంకర్లపైన ఆధారపడాల్సిన దుస్థితి. తాగునీటిదీ అదే ప‌రిస్థితి. గుక్కెడు నీటి కోసం జిల్లాలో పట్టణాల మొదలు గ్రామాల వరకు తహతహలాడుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో 2,348 గ్రామాలకు ఇప్పటికీ నీటి ట్యాంకర్లే దిక్కు. గ్రామాల్లో రోజుకు 1800 ట్రిప్పులు, పట్టణాల్లో 1600 ట్రిప్పులు తోలుతున్నారు. నెలకు సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చవుతోంది. పల్లెల్లో వ్యవసాయ పనుల్లేకపోవడంతో కూలీలు, రైతులు పొట్ట చేత పట్టుకుని బెంగళూరు, చెన్నై, తిరుపతి వంటి నగరాలకు వలసలు పోతున్నారు. ఉపాధి హామీ పనులు చూపించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజక వర్గం కుప్పంలో రెండువేలకు పైగా కుటుంబాలు కూలి పనుల కోసం బెంగళూరుకు వలస వెళ్తున్నాయి. సొంత‌నియోజ‌క‌వ‌ర్గంలోనూ, సొంత జిల్లాలోనూ ఏమీ చేయ‌లేని ముఖ్య‌మంత్రి ఇక రాష్ర్టానికి ఏం చేస్తాడ‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.
First Published:  15 Aug 2015 2:15 AM GMT
Next Story