Telugu Global
Others

పాక్ అధ్య‌క్షుడి శాంతి జపం

ప్ర‌పంచదేశాల‌తో శాంతియుత సంబంధాల‌ను పాకిస్థాన్ కోరుకుంటుంద‌ని ఆ దేశాధ్య‌క్షుడు మ‌మ్మూన్ హుస్సేన్ శుక్ర‌వారం అన్నారు. పాకిస్థాన్ 69వ స్వాతంత్ర్య దినోత్స‌వ సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. భార‌త -పాక్ నియంత్ర‌ణ రేఖ‌ వ‌ద్ద ఇటీవ‌ల తలెత్తిన ఉద్రిక్త ప‌రిస్థితుల‌పై ఆయ‌న విచారం వ్య‌క్తం చేశారు. ఉగ్ర‌వాదాల‌కు పాక్‌ ఆసరాగా ఉంద‌న్న ఆరోప‌ణ‌లను ఆయ‌న ఖండించారు. ఏ దేశంతోనైనా శాంతియుత సంబంధాల‌నే పాక్ కోరుతోంద‌ని అయ‌న స్ప‌ష్టం చేశారు. ఎప్పటి మాదిరిగా పాక్ స్వాతంత్ర్య దినోత్స‌వం రోజున […]

పాక్ అధ్య‌క్షుడి శాంతి జపం
X
ప్ర‌పంచదేశాల‌తో శాంతియుత సంబంధాల‌ను పాకిస్థాన్ కోరుకుంటుంద‌ని ఆ దేశాధ్య‌క్షుడు మ‌మ్మూన్ హుస్సేన్ శుక్ర‌వారం అన్నారు. పాకిస్థాన్ 69వ స్వాతంత్ర్య దినోత్స‌వ సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. భార‌త -పాక్ నియంత్ర‌ణ రేఖ‌ వ‌ద్ద ఇటీవ‌ల తలెత్తిన ఉద్రిక్త ప‌రిస్థితుల‌పై ఆయ‌న విచారం వ్య‌క్తం చేశారు. ఉగ్ర‌వాదాల‌కు పాక్‌ ఆసరాగా ఉంద‌న్న ఆరోప‌ణ‌లను ఆయ‌న ఖండించారు. ఏ దేశంతోనైనా శాంతియుత సంబంధాల‌నే పాక్ కోరుతోంద‌ని అయ‌న స్ప‌ష్టం చేశారు. ఎప్పటి మాదిరిగా పాక్ స్వాతంత్ర్య దినోత్స‌వం రోజున భార‌త సైనికులకు మిఠాయి పంచ‌లేదు. ప్ర‌తి సంవ‌త్స‌రం ఇరు దేశాల స్వాతంత్ర్య దినోత్స‌వాలనాడు మిఠాయిలు పంచుకోవ‌డం ఆన‌వాయితీ. ఈసారి దానికి బ్రేక్‌ పడింది. ఇంతకుముందు కూడా భారత్‌ సైనికులు పాక్‌ దళాలకు మిఠాయిలు అందజేసినపుడు వారు తీసుకోక పోవడం గమనార్హం.
First Published:  15 Aug 2015 12:12 AM GMT
Next Story