Telugu Global
Others

త్వ‌ర‌లో ఉల్లి పాల‌సీ 

ఉల్లి దిగుమ‌తిని పెంచేందుకు ప్ర‌భుత్వం నెల రోజుల్లో ప్ర‌త్యేక ఉల్లి పాల‌సీని రూపొందిస్తుంద‌ని మంత్రి హ‌రీష్ రావు వెల్ల‌డించారు. ఆయ‌న మ‌రో మంత్రి పోచారం శ్రీ‌నివాస‌రెడ్డితో క‌లిసి ఇందిరా ప్రియ‌ద‌ర్శిని ఆడిటోరియంలో ఉద్యాన శాఖ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఉల్లిసాగుపై రాష్ట్ర‌స్థాయి రైతు స‌ద‌స్సులో పాల్గొన్నారు. ఈ పాల‌సీ ద్వారా 75 శాతం విత్త‌న స‌బ్సిడీ ఇస్తామ‌ని, ఏడాది పొడ‌వునా విత్త‌నాలు అందుబాటులో ఉంచుతామ‌ని చెప్పారు. వ్య‌వ‌సాయ మంత్రి పోచారం మాట్లాడుతూ మ‌న రాష్ట్రానికి 3.60 ల‌క్ష‌ల ట‌న్నుల […]

త్వ‌ర‌లో ఉల్లి పాల‌సీ 
X
ఉల్లి దిగుమ‌తిని పెంచేందుకు ప్ర‌భుత్వం నెల రోజుల్లో ప్ర‌త్యేక ఉల్లి పాల‌సీని రూపొందిస్తుంద‌ని మంత్రి హ‌రీష్ రావు వెల్ల‌డించారు. ఆయ‌న మ‌రో మంత్రి పోచారం శ్రీ‌నివాస‌రెడ్డితో క‌లిసి ఇందిరా ప్రియ‌ద‌ర్శిని ఆడిటోరియంలో ఉద్యాన శాఖ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఉల్లిసాగుపై రాష్ట్ర‌స్థాయి రైతు స‌ద‌స్సులో పాల్గొన్నారు. ఈ పాల‌సీ ద్వారా 75 శాతం విత్త‌న స‌బ్సిడీ ఇస్తామ‌ని, ఏడాది పొడ‌వునా విత్త‌నాలు అందుబాటులో ఉంచుతామ‌ని చెప్పారు. వ్య‌వ‌సాయ మంత్రి పోచారం మాట్లాడుతూ మ‌న రాష్ట్రానికి 3.60 ల‌క్ష‌ల ట‌న్నుల ఉల్లిగ‌డ్డ‌ల అవ‌స‌రం ఉంద‌ని, అయితే 2 ల‌క్ష‌ల ట‌న్నులు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయ‌ని అన్నారు. ఉల్లికి, ట‌మోటాకు ఒకేసారి ధ‌ర పెర‌గ‌డం, ఒకేసారి త‌గ్గ‌డం జ‌రుగుతోంద‌ని , ఈ ప‌రిస్థితిని నివారించ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న చెప్పారు.
First Published:  14 Aug 2015 1:05 PM GMT
Next Story