Telugu Global
Others

పాక్ కాల్పుల్లో ఐదుగురు మృతి 

పాకిస్థాన్ ప్ర‌పంచశాంతిని కోరుకుంటుంద‌ని ఆ దేశాధ్యక్షుడు  ఆగ‌స్టు 14వ తేదీన జ‌రిగిన పాక్ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల్లో  ప్ర‌క‌టించారు. శాంతి కామ‌క‌లం అని  ప్ర‌క‌టించి ఇర‌వై నాలుగ్గంట‌లు కూడా గ‌డ‌వ‌క ముందే పాక్  త‌న నైజాన్ని మ‌రోసారి ప్ర‌ద‌ర్శించింది. ఆగ‌స్టు 15 భార‌త స్వాతంత్ర్య దినోత్స‌వం రోజున కూడా కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జ‌మ్ము క‌శ్మీర్లోని పూంచ్ జిల్లాలోని స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో జ‌నావాసాల‌పై పాకిస్థాన్ సైన్యం విరుచుకు ప‌డింది. పాక్ కాల్పుల్లో 5గురు మర‌ణించారు. 22 […]

పాకిస్థాన్ ప్ర‌పంచశాంతిని కోరుకుంటుంద‌ని ఆ దేశాధ్యక్షుడు ఆగ‌స్టు 14వ తేదీన జ‌రిగిన పాక్ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల్లో ప్ర‌క‌టించారు. శాంతి కామ‌క‌లం అని ప్ర‌క‌టించి ఇర‌వై నాలుగ్గంట‌లు కూడా గ‌డ‌వ‌క ముందే పాక్ త‌న నైజాన్ని మ‌రోసారి ప్ర‌ద‌ర్శించింది. ఆగ‌స్టు 15 భార‌త స్వాతంత్ర్య దినోత్స‌వం రోజున కూడా కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జ‌మ్ము క‌శ్మీర్లోని పూంచ్ జిల్లాలోని స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో జ‌నావాసాల‌పై పాకిస్థాన్ సైన్యం విరుచుకు ప‌డింది. పాక్ కాల్పుల్లో 5గురు మర‌ణించారు. 22 మందికి పైగా గాయ‌ప‌డ్డార‌ని అధికారులు వెల్ల‌డించారు.
First Published:  15 Aug 2015 1:10 PM GMT
Next Story