Telugu Global
Others

54 మందితో కుప్పకూలిన ఇండోనేషియా విమానం

ఇండోనేషియా విమానం 54 ప్రయాణికులను బలి తీసుకుంది. మధ్యాహ్నం గల్లంతైన త్రిగణ ఎయిర్ ఏటీఆర్-42 విమానం పపువా గినియా ప్రాంతంలో కుప్పకూలింది. ఈ విమానంలో ఐదుగురు సిబ్బంది సహా 54 మంది ప్రయాణిస్తున్నారు. విమానం కొండను ఢీకొని కుప్పకూలిపోవడంతో అందులోని వారెవరూ బ్రతికుండే అవకాశం లేదని అక్కడి అధికారులు భావిస్తున్నారు. విమానం గల్లంతైన కొద్ది గంటల తరువాత పపువా గినియా ప్రాంతంలోని పెద్ద శబ్దంతో పెలుడు సంభవించింది. ఇది గమనించి స్థానికులు విమాన శకలాలను గుర్తించారు. వెంటనే […]

54 మందితో కుప్పకూలిన ఇండోనేషియా విమానం
X

ఇండోనేషియా విమానం 54 ప్రయాణికులను బలి తీసుకుంది. మధ్యాహ్నం గల్లంతైన త్రిగణ ఎయిర్ ఏటీఆర్-42 విమానం పపువా గినియా ప్రాంతంలో కుప్పకూలింది. ఈ విమానంలో ఐదుగురు సిబ్బంది సహా 54 మంది ప్రయాణిస్తున్నారు. విమానం కొండను ఢీకొని కుప్పకూలిపోవడంతో అందులోని వారెవరూ బ్రతికుండే అవకాశం లేదని అక్కడి అధికారులు భావిస్తున్నారు. విమానం గల్లంతైన కొద్ది గంటల తరువాత పపువా గినియా ప్రాంతంలోని పెద్ద శబ్దంతో పెలుడు సంభవించింది. ఇది గమనించి స్థానికులు విమాన శకలాలను గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందవేశారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.అంతకుముందు ఈ విమానానికి స్థానిక కాలమాన ప్రకారం… మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పపువా ప్రాంతంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ రూమ్‌తో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు గుర్తించారు. దీని ప్రకారం పపువా ప్రాంతంలోనే విమానం తప్పిపోయి ఉంటుందని అధికారులు భావించారు.. ఈ విమానంలోని ప్రయాణికుల్లో 44 మంది పెద్దలు, 5 గురు పిల్లలు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. కాగా, గత సంవత్సరం డిసెంబర్ 28 జావా సముద్రంలో ఎయిర్ ఏషియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. తాజా మరో విమానం కూలిపోవడంతో ఇండోనేషియా విమానాలంటేనే ప్రయాణికుల్లో దడ పుడుతోంది.

First Published:  16 Aug 2015 11:22 AM GMT
Next Story