Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 176

పౌష్టికాహారం టీచర్‌: “రాజేష్‌! పౌష్టికాహారం అంటే ఏంటో చెప్పు చూద్దాం.” రాజేష్‌: “రుచీపచీ లేకుండా ఉండి, కేవలం కడుపు నింపుకోవడం కోసం తినే తిండి.” ——————————————————————– పుణ్యం “ఈ వయస్సులో నీ భార్యని చంపాలని ఎందుకనుకున్నావ్‌” బోనులోని వృద్ధుడిని అడిగాడు జడ్జి. “పుణ్య స్త్రీ సీరియల్‌ చూస్తూ పూట పూటా మీకన్నా నేను ముందుగా పోవాలండి అంటూ బుర్ర తినేస్తూ ఉంటే చిర్రెత్తుకొచ్చి చంపేశాను.” ——————————————————————– స్పీడ్‌ స్పీడ్‌గా కారు నడుపుతున్న ఒకావిడని ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఆపాడు. […]

పౌష్టికాహారం
టీచర్‌: “రాజేష్‌! పౌష్టికాహారం అంటే ఏంటో చెప్పు చూద్దాం.”
రాజేష్‌: “రుచీపచీ లేకుండా ఉండి, కేవలం కడుపు నింపుకోవడం కోసం తినే తిండి.”
——————————————————————–
పుణ్యం
“ఈ వయస్సులో నీ భార్యని చంపాలని ఎందుకనుకున్నావ్‌” బోనులోని వృద్ధుడిని అడిగాడు జడ్జి.
“పుణ్య స్త్రీ సీరియల్‌ చూస్తూ పూట పూటా మీకన్నా నేను ముందుగా పోవాలండి అంటూ బుర్ర తినేస్తూ ఉంటే చిర్రెత్తుకొచ్చి చంపేశాను.”
——————————————————————–
స్పీడ్‌
స్పీడ్‌గా కారు నడుపుతున్న ఒకావిడని ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఆపాడు.
“మీరు 60 దాటారు. అవును కదా!” సీరియస్‌గా అడిగాడు.
“ఏం కాదు…. జస్ట్‌ 30… ఇవాళ మేకప్‌ వేసుకోక మీకలా అనిపిస్తోంది అంతే” అనేసి స్పీడ్‌గా వెళ్లిపోయిందావిడ.
——————————————————————–
పెళ్లి
“మీ పెళ్లి రిజిష్టర్‌ ఆఫీసులో చేసుకుంటే తర్వాత లీగల్‌గా ఏ ప్రాబ్లెమ్స్‌ ఉండవు కదరా!”
“లీగల్‌ ప్రాబ్లెమ్స్‌ తర్వాత, ముందు ఫిజికల్‌ ప్రాబ్లమ్స్‌ వస్తాయి.”
“అదేంట్రా?”
“ఆ అమ్మాయి తండ్రే రిజిస్ట్రారు మరి!”

First Published:  15 Aug 2015 1:03 PM GMT
Next Story