Telugu Global
Others

క‌ర్ణాట‌క బ‌రితెగింపు... కృష్ణా న‌దిపై మరో అక్ర‌మ బ్యారేజీ

క‌ర్ణాట‌క బ‌రితెగించి మ‌రో అక్ర‌మ కట్ట‌డానికి సిద్ధ‌మైంది. రాయ‌చూర్ జిల్లాలోని గిరిజాపూర్ గ్రామం వ‌ద్ద కృష్ణా భీమా న‌దుల సంగ‌మానికి మూడు కిలోమీట‌ర్ల ఎగువ‌న కృష్ణాన‌దిపై రెండు టిఎమ్‌సీల సామ‌ర్థ్యం గ‌ల బ్యారేజీని క‌ర్ణాట‌క నిర్మిస్తుస్తోందని తెలంగాణ ఇంజ‌నీర్లు నిర్థారించారు. ఈ అక్ర‌మ బ్యారేజీని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజ‌నీర్ హెచ్‌.టి.శ్రీధ‌ర్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ సురేంద‌ర‌రావులతో కూడిన బృందం సంద‌ర్శించ‌డంతోపాటు ప్రాజెక్టు ప్ర‌దేశాన్ని ఫొటోలు తీసి ప్ర‌భుత్వానికి అంద‌చేసింది. ఈ నివేదిక ప్ర‌కారం క‌ర్ణాట‌క […]

క‌ర్ణాట‌క బ‌రితెగింపు... కృష్ణా న‌దిపై మరో అక్ర‌మ బ్యారేజీ
X

క‌ర్ణాట‌క బ‌రితెగించి మ‌రో అక్ర‌మ కట్ట‌డానికి సిద్ధ‌మైంది. రాయ‌చూర్ జిల్లాలోని గిరిజాపూర్ గ్రామం వ‌ద్ద కృష్ణా భీమా న‌దుల సంగ‌మానికి మూడు కిలోమీట‌ర్ల ఎగువ‌న కృష్ణాన‌దిపై రెండు టిఎమ్‌సీల సామ‌ర్థ్యం గ‌ల బ్యారేజీని క‌ర్ణాట‌క నిర్మిస్తుస్తోందని తెలంగాణ ఇంజ‌నీర్లు నిర్థారించారు. ఈ అక్ర‌మ బ్యారేజీని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజ‌నీర్ హెచ్‌.టి.శ్రీధ‌ర్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ సురేంద‌ర‌రావులతో కూడిన బృందం సంద‌ర్శించ‌డంతోపాటు ప్రాజెక్టు ప్ర‌దేశాన్ని ఫొటోలు తీసి ప్ర‌భుత్వానికి అంద‌చేసింది. ఈ నివేదిక ప్ర‌కారం క‌ర్ణాట‌క ప‌వ‌ర్ కార్పోరేష‌న్ లిమిటెడ్ అక్క‌డ 1170 మీట‌ర్ల పొడ‌వుతో 194 గేట్లు అమ‌ర్చే విధంగా ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుంది.క‌ర్ణాట‌క‌ ప్ర‌భుత్వం బెంగ‌ళూరుకు చెందిన ర‌ఘు ఇన్‌ఫ్రా గ్రూపుకు ప్రాజెక్టు నిర్మాణ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. జూలైలో ప్రారంభించిన ఈ బ్యారేజి నిర్మాణం 24 నెల‌ల్లో పూర్తి కావ‌ల‌సి ఉంది. ఈ బ్యారేజి నిర్మాణం పూర్త‌యితే, తెలంగాణ‌లోని జూరాల ప్రాజెక్టు నీరు నిలిచిపోవ‌డంతోపాటు నారాయ‌ణ‌పూర్ రిజ‌ర్వాయ‌ర్‌లో విద్యుతుత్ప‌త్తికి కూడా నీరు అందుబాటులో ఉండ‌దు. క‌ర్ణాట‌క నిర్మిస్తున్న అక్ర‌మ బ్యారేజిపై కేంద్రానికి ఫిర్యాదు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈమేర‌కు మంత్రి హ‌రీష్‌రావు అధికారుల‌ను ఆదేశించారు.

First Published:  16 Aug 2015 7:48 AM GMT
Next Story