Telugu Global
Others

నాగం కొత్త‌ కుంప‌టి బ‌చావో తెలంగాణ‌!

తెలంగాణ‌లో మ‌రో ఉద్య‌మ వేదిక పురుడు పోసుకోనుంది. బీజేపీ నేత నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీ‌నివాస్ రెడ్డిల ఆధ్వ‌ర్యంలో ‘బ‌చావో తెలంగాణ’ ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిసింది. రాజ‌కీయాల‌కు అతీతంగా ఈ వేదిక‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు స‌మాచారం. తెలంగాణ‌లో దీర్ఘ‌కాలంగా ప‌రిష్కారానికి నోచుకోని స‌మ‌స్య‌ల‌పై ఉద్య‌మించ‌డ‌మే ల‌క్ష్యంగా వేదిక ఆవిర్భ‌వించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ నెల 19న హైదరాబాద్‌లోని బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో ‘బ‌చావో తెలంగాణ’ విధివిధానాల‌పై ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. రాజ‌కీయాల‌కు అతీతంగా ఈ వేదిక‌ను […]

నాగం కొత్త‌ కుంప‌టి బ‌చావో తెలంగాణ‌!
X
తెలంగాణ‌లో మ‌రో ఉద్య‌మ వేదిక పురుడు పోసుకోనుంది. బీజేపీ నేత నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీ‌నివాస్ రెడ్డిల ఆధ్వ‌ర్యంలో ‘బ‌చావో తెలంగాణ’ ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిసింది. రాజ‌కీయాల‌కు అతీతంగా ఈ వేదిక‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు స‌మాచారం. తెలంగాణ‌లో దీర్ఘ‌కాలంగా ప‌రిష్కారానికి నోచుకోని స‌మ‌స్య‌ల‌పై ఉద్య‌మించ‌డ‌మే ల‌క్ష్యంగా వేదిక ఆవిర్భ‌వించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ నెల 19న హైదరాబాద్‌లోని బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో ‘బ‌చావో తెలంగాణ’ విధివిధానాల‌పై ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. రాజ‌కీయాల‌కు అతీతంగా ఈ వేదిక‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెబుతున్నా.. 2019 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా పోరాటాలు రూపొందిస్తున్న‌ట్లు స‌మాచారం.
నాగం బీజీపీని వీడుతున్నారా?
2014 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీకి రాజీనామా చేసిన నాగం జ‌నార్ద‌న్ రెడ్డి ‘తెలంగాణ న‌గారా’ పేరిట సొంత కుంప‌టి పెట్టుకున్నారు. టీడీపీలో ఉండ‌క‌లేక‌, టీఆర్ ఎస్‌లో చేర‌లేక‌, కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు మ‌న‌సు ఒప్ప‌క స్వతంత్ర వేదిక‌ను ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని న‌డ‌ప‌లేక చివ‌రకు బీజేపీలో విలీనం చేసేశారు. సొంత జిల్లా పాల‌మూరు నుంచి పార్ల‌మెంటు టికెట్ తెచ్చుకోగ‌లిగారు. అయినా ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. అప్ప‌టి నుంచి రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డితో నాగంకు అంత‌గా పొస‌గ‌డం లేదు. త‌న‌కు పార్టీలో స‌రైన ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని ఆయ‌న కొంత‌కాలంగా పార్టీ కార్యాల‌యానికే రావ‌డం మానేశారు. ఇటీవ‌ల బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి పాల‌మూరు ప‌ర్య‌ట‌న చేప‌ట్టినా.. నాగం వ‌ర్గం దూరంగా ఉంది. త‌మ‌కు ఎలాంటి స‌మాచారం లేనందునే తాము దూరంగా ఉన్నామ‌ని చెప్పుకొచ్చింది. దీంతో నాగం పార్టీ మారుతున్నార‌న్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై నాగం ఇంత‌వ‌ర‌కు ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. కానీ, తెలంగాణ బ‌చావో వేదిక ప్ర‌కట‌న‌తో ఈ ఊహాగానాల‌కు తెర‌ప‌డింది. ఇది ఎంత‌కాలం మ‌న‌గ‌లుగుతుంద‌న్న ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఎన్నిక‌ల‌కు ముందు తెలంగాణ న‌గ‌రాను క‌నీసం ఏడాది కూడా న‌డ‌ప‌లేక బీజేపీలో విలీనం చేసిన నాగం, బ‌చావో తెలంగాణ‌ను ఎంత‌కాలం కొన‌సాగిస్తార‌న్న‌ది ఆస‌క్తికకరంగా మారింది.
First Published:  16 Aug 2015 6:29 AM GMT
Next Story