Telugu Global
Cinema & Entertainment

కిక్-3 కూడా రాబోతోంది

కిక్-2నే ఇంకా విడుదల కాలేదు. ఇంతలోనే కిక్-3కి సంబంధించి చర్చ ప్రారంభమైంది. దీనికి కారణం దర్శకుడు సురేందర్ రెడ్డి. అవును.. కిక్-2 ప్రమోషన్ లో భాగంగా సురేందర్ రెడ్డి విడుదల చేసిన టీజర్ కిక్-3 టైటిల్ కూడా చూపించాడు. అంటే.. కిక్ సినిమాను ముగించినట్టుగానే.. కిక్-2 సినిమాను కూడా కొనసాగింపునకు వీలుగా ముగించినట్టు తెలుస్తోంది. రవితేజ-సురేందరెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన కిక్-2 సినిమా ఆగస్ట్ 21న విడుదలకాబోతోంది. మరో హీరో కల్యాణ్ రామ్ ఈ సినిమాకు నిర్మాత. […]

కిక్-3 కూడా రాబోతోంది
X
కిక్-2నే ఇంకా విడుదల కాలేదు. ఇంతలోనే కిక్-3కి సంబంధించి చర్చ ప్రారంభమైంది. దీనికి కారణం దర్శకుడు సురేందర్ రెడ్డి. అవును.. కిక్-2 ప్రమోషన్ లో భాగంగా సురేందర్ రెడ్డి విడుదల చేసిన టీజర్ కిక్-3 టైటిల్ కూడా చూపించాడు. అంటే.. కిక్ సినిమాను ముగించినట్టుగానే.. కిక్-2 సినిమాను కూడా కొనసాగింపునకు వీలుగా ముగించినట్టు తెలుస్తోంది. రవితేజ-సురేందరెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన కిక్-2 సినిమా ఆగస్ట్ 21న విడుదలకాబోతోంది. మరో హీరో కల్యాణ్ రామ్ ఈ సినిమాకు నిర్మాత. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. సినిమాకు కాస్త నెగెటివ్ పబ్లిసిటీ వచ్చినప్పటికీ.. అంచనాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మరీ ముఖ్యంగా బాహుబలి, శ్రీమంతుడు మేనియా పూర్తవ్వడంతో.. కిక్-2 సినిమా సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు. కిక్-2 కనుక సక్సెస్ అయితే.. కిక్-3 కూడా వచ్చి తీరుతుంది.
First Published:  16 Aug 2015 7:00 PM GMT
Next Story