Telugu Global
Others

గ్రామజ్యోతి ఆలంబనగా టీఆర్‌ఎస్‌ నాయకుల ఆశలు

తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్న గ్రామజ్యోతి కార్యక్రమంపై టీఆర్‌ఎస్‌ నాయకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇది గ్రామాలకు ఎంతగా ఉపయోగపడుతుందో తెలీదు కాని నామినేటెడ్‌ పదవులు ఆశించే వారికి ఇది ఎంట్రెన్స్‌ లాంటిదన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. అందుకే టీఆర్‌ఎస్‌ అధినేత నుంచి మంచి మార్కులు కొట్టేందుకు ఆయనకు ఇష్టమైన గ్రామజ్యోతిని వేదికగా చేసుకోవాలని టీఆర్ఎస్‌ నాయకులు తపన పడుతున్నారు. అయితే వారి దూకుడుకు క్షేత్రస్థాయిలోని సమస్యలు స్పీడ్‌ బ్రేకర్‌లా మారుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగంతోపాటు.. పార్టీ శ్రేణులూ […]

గ్రామజ్యోతి ఆలంబనగా టీఆర్‌ఎస్‌ నాయకుల ఆశలు
X
తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్న గ్రామజ్యోతి కార్యక్రమంపై టీఆర్‌ఎస్‌ నాయకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇది గ్రామాలకు ఎంతగా ఉపయోగపడుతుందో తెలీదు కాని నామినేటెడ్‌ పదవులు ఆశించే వారికి ఇది ఎంట్రెన్స్‌ లాంటిదన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. అందుకే టీఆర్‌ఎస్‌ అధినేత నుంచి మంచి మార్కులు కొట్టేందుకు ఆయనకు ఇష్టమైన గ్రామజ్యోతిని వేదికగా చేసుకోవాలని టీఆర్ఎస్‌ నాయకులు తపన పడుతున్నారు. అయితే వారి దూకుడుకు క్షేత్రస్థాయిలోని సమస్యలు స్పీడ్‌ బ్రేకర్‌లా మారుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగంతోపాటు.. పార్టీ శ్రేణులూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని గులాబీ దళపతి పిలుపునిచ్చారు. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు.. గ్రామజ్యోతిలో మమేకమయ్యేందుకు సన్నద్ధమవుతున్నాయి.
త్వరలోనే నామినేటెడ్‌ పదవులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది దాటినా నామినేటెడ్‌ పదవుల ఊసెత్తని సీఎం… ఇటీవల వాటిపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో తెరపైకి వచ్చిన గ్రామజ్యోతి కార్యక్రమం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఉపయోగపడే సాధనంగా మారింది. పైగా పార్టీ శ్రేణులందరూ గ్రామజ్యోతిలో భాగస్వాములు కావాలని అధినేత పిలుపు ఇవ్వడంతో పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న నేతలతో పాటు.. నామినేటెడ్‌ పదవులు ఆశిస్తున్న నాయకులకు సీఎం ప్రకటన నిజంగానే కొత్త ఆశలు చిగురింప చేసింది. దీంతో ఇలాంటి వారంతా గ్రామజ్యోతిలో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించుని ఆ దిశలో సమాయత్తమవుతున్నారు.
వారం రోజుల పాటు నిర్వహించే ఈ గ్రామజ్యోతి పథకం గ్రామసభలు గ్రామాల రూపు రేఖలు మారుస్తాయో లేదో గాని పార్టీ నేతలను మాత్రం ఒక్కతాటిపై నిలిపి ఉంచేందుకు అధికార పార్టీ వ్యూహం ఫలిస్తున్నట్లుగానే ఉంది. గ్రామసభల ద్వారా వచ్చే ప్రతిపాదనల్లో అధికార పార్టీకి చెందిన నేతలు సూచించిన వాటికే ఎక్కువ ప్రాధాన్యత దక్కే అవకాశాలున్నాయి. అయితే నామినేటెడ్‌ పదవులపై ఆశలతో.. గ్రామజ్యోతి బరిలోకి దిగుతున్న నేతలకు.. ప్రజా సమస్యలు వారిని ఇబ్బంది పెట్టే అవకాశం స్పష్టం కనిపిస్తోంది. దళితులకు మూడెకరాల భూ పంపిణీ నుంచి… వితంతు, వృద్ధాప్య పెన్షన్లు, రేషన్ కార్డుల పంపిణీ వంటి అంశాలపై ప్రజల్లో చాలా అసంతృప్తి గూడు కట్టుకుని ఉంది. ఈ నేపథ్యంలో ప్రారంభమవుతున్న గ్రామజ్యోతి పథకం వల్ల నాయకులు లబ్ది పొందుతారో… ప్రజల నుంచి వ్యతిరేకత పొందుతారో వేచి చూడాలి.
First Published:  17 Aug 2015 1:57 AM GMT
Next Story