Telugu Global
Others

ద‌ళితుల‌ భూపంపిణీపై నిర్లక్ష్యపు నీడలు

తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి కె. చంద్రశేఖరావు తొలిసారి ప్రకటించిన పథకానికే గ్రహణం పట్టింది. ఈ పథకం కింద ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి పంపిణీ చేయాలని నిర్ణయించారు. భూమిలేని ద‌ళితుల‌కు భూమితోపాటు సాగుకు అవ‌స‌ర‌మైన నీరు సమకూర్చడానికి బోరు, విద్యుత్తు, డ్రిప్ ఇరిగేష‌న్ సౌక‌ర్యాల‌తోపాటు ఏడాదిపాటు ఉచితంగా ఎరువులు కూడా పంపిణీ చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ ప‌థ‌కం కోసం ప్ర‌తి జిల్లాకు వెయ్యి కోట్ల రూపాయ‌లు కూడా మంజూరు […]

ద‌ళితుల‌ భూపంపిణీపై నిర్లక్ష్యపు నీడలు
X
తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి కె. చంద్రశేఖరావు తొలిసారి ప్రకటించిన పథకానికే గ్రహణం పట్టింది. ఈ పథకం కింద ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి పంపిణీ చేయాలని నిర్ణయించారు. భూమిలేని ద‌ళితుల‌కు భూమితోపాటు సాగుకు అవ‌స‌ర‌మైన నీరు సమకూర్చడానికి బోరు, విద్యుత్తు, డ్రిప్ ఇరిగేష‌న్ సౌక‌ర్యాల‌తోపాటు ఏడాదిపాటు ఉచితంగా ఎరువులు కూడా పంపిణీ చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ ప‌థ‌కం కోసం ప్ర‌తి జిల్లాకు వెయ్యి కోట్ల రూపాయ‌లు కూడా మంజూరు చేశారు. అయితే అధికారుల నిర్ల‌క్ష్యంతో ప‌థ‌కం నీరుగారి పోతోంది. ప్ర‌భుత్వ అంచ‌నాలు, పేద ప్ర‌జ‌ల ఆశ‌లు లెక్క‌ త‌ప్పాయి. ఈ ప‌థ‌కం మొత్తం రెవిన్యూ యంత్రాంగం చేతిలోనే ఉంది. జిల్లా కలెక్ట‌ర్లు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ల‌బ్దిదారుల‌ను గుర్తించి, జాయింట్ క‌లెక్ట‌ర్లు, ఆర్డీవోలు, త‌హ‌సీల్దార్లు ప‌ధ‌కాన్ని అమ‌లు చేయాల్సి ఉంటుంది. అయితే, అధికారులు ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఏడాది కాలంలో 1343 మంది ల‌బ్దిదారుల‌ను గుర్తించి, 3600 ఎక‌రాల‌ను సేక‌రించారు. అందులో 450 ఎక‌రాలు ప్ర‌భుత్వ భూమి కాగా, మిగిలిన 3,150 ఎక‌రాల‌ను ప్రైవేట్ వ్య‌క్తుల నుంచి ప్ర‌భుత్వం కొనుగోలు చేసింది. ఇందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ. 1300 కోట్లు ఖ‌ర్చు చేసింది. అధికారులు తాము ఎంపిక చేసిన ల‌బ్దిదారుల్లో 810 మందికి 2430 ఎక‌రాల‌ను పంపిణీ చేసి ప‌ట్టాలు అంద‌చేశారు. అయితే, గ్రామాల్లో పెద్ద సంఖ్య‌లో భూమిలేని ద‌ళితులున్న‌ప్ప‌టికీ, వారిని గుర్తించి భూమిని పంపిణీ చేయ‌డంలో అధికారులు, ప్ర‌భుత్వ పెద్ద‌లు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ద‌ళిత సంఘాల నేత‌లు ఆరోపిస్తున్నారు. ప్ర‌భుత్వం ఇక‌నైనా భూపంపిణీపై దృష్టి పెట్టాల‌ని వారు కోరుతున్నారు. మిగిలిన 533 మంది లబ్దిదారులకు 2.1 ఎకరాల చొప్పునే పంపిణీ చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. అసలు ఈ పంపిణీ వ్యవస్థ గందరగోళంగా ఉండడానికి దీనిపై సరైన పర్యవేక్షణ లేకపోవడమే కారణంగా తెలుస్తోంది.
First Published:  17 Aug 2015 1:43 AM GMT
Next Story