Telugu Global
Cinema & Entertainment

బాహుబలిలో డబ్లూ.డబ్లూ.ఈ రెజ్లింగ్ స్టార్స్!

రికార్డు కలెక్షన్లతో ప్రపంచవ్యాప్తంగా ఆల్టైమ్ రికార్డులు సృష్టించిన బాహుబలిని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు దర్శకుడు జక్కన్న ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సినిమా రెండోభాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో వారిని సంతృప్తి పరిచేలా పలు అంశాలను జోడించాలని ఆలోచిస్తున్నాడట. యాక్షన్ సన్నివేశాల విషయానికొస్తే.. బాహుబలి-2లో ఈసారి పలు విశేషాలు చోటుచేసుకోనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అరవీర భయంకర  పోరాట యోధులుగా పేరొందిన డబ్లూ.డబ్లూ.ఈ (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టెయిన్మెంట్) స్టార్లతో ప్రభాస్ తలపడేలా పలు సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. […]

బాహుబలిలో డబ్లూ.డబ్లూ.ఈ రెజ్లింగ్ స్టార్స్!
X
రికార్డు కలెక్షన్లతో ప్రపంచవ్యాప్తంగా ఆల్టైమ్ రికార్డులు సృష్టించిన బాహుబలిని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు దర్శకుడు జక్కన్న ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సినిమా రెండోభాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో వారిని సంతృప్తి పరిచేలా పలు అంశాలను జోడించాలని ఆలోచిస్తున్నాడట. యాక్షన్ సన్నివేశాల విషయానికొస్తే.. బాహుబలి-2లో ఈసారి పలు విశేషాలు చోటుచేసుకోనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అరవీర భయంకర పోరాట యోధులుగా పేరొందిన డబ్లూ.డబ్లూ.ఈ (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టెయిన్మెంట్) స్టార్లతో ప్రభాస్ తలపడేలా పలు సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రెజ్లింగ్ గేమ్లో సూపర్స్టార్లు బ్రాక్ లెస్నర్, జాన్సీనాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీత ఆదరణ ఉంది. వీరిని సినిమాలో నటించేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. వారు ఉంటే.. సినిమాకు అంతర్జాతీయ ప్రచారం సులువుగా దొరుకుతుందన్నది జక్కన్న ఆలోచనగా చెబుతున్నారు. అయితే సినిమా మొదటి భాగంలో కాలకేయ స్థానంలో ట్రాయ్ సినిమాలో విలన్ పాత్ర పోషించిన హాలీవుడ్ నటుడిని అనుకున్నారని వార్తలు వచ్చాయి. ఎందుకో అది వర్కవుట్ కాలేదు. ఈ వార్తలు ఎంత వరకు కార్యరూపం దాలుస్తాయన్నది వేచి చూడాలి మరి! జక్కన సినిమాలో విలన్లు భయంకరంగా ఉంటారు. వారి పాత్ర, ఆహార్యం అత్యంత క్రూరంగా, పాశవికంగా తీర్చిదిద్దబడతాయి. అంతటి ప్రతిభ కలిగిన జక్కనకు హాలీవుడ్ నుంచి ఫైటర్లను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందా? అని సినీపండితులు చర్చించుకుంటున్నారు. బాహుబలి ఎలాగూ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది కాబట్టి వారిని సినిమాలో భాగస్వామ్యం చేస్తే ఓవర్సీస్ మార్కెట్ తోపాటు విదేశాల్లో ప్రచారం కూడా పెరుగుతుందన్నది మరికొందరి వాదన. ఈ ఊహాగానాలకి జక్కన్న ఎప్పుడు తెరదించుతాడో?
First Published:  16 Aug 2015 7:05 PM GMT
Next Story