Telugu Global
Cinema & Entertainment

సీనియర్ దర్శకుడితో రాజ్ తరుణ్ సినిమా

ఉయ్యాల జంపాల సినిమాతో పేరుతెచ్చుకున్నాడు రాజ్ తరుణ్. తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు సినిమాల విషయంలో దూకుడు పెంచాడు. రీసెంట్ గా సినిమా చూపిస్త మామ అంటూ మనముందుకొచ్చాడు. ఉయ్యాల జంపాల హీరోయిన్ అవికా గౌర్ తో కలిసి ఈ సినిమాలో నటించాడు రాజ్ తరుణ్. ఓ డిఫరెంట్ మూవీగా పేరుతెచ్చుకుంది సినిమా చూపిస్త మామ. ఈ మూవీతో పాటు ప్రస్తుతం సూర్యప్రతాప్ దర్శకత్వంలో కుమారి 21-ఎఫ్ అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు రాజ్ […]

సీనియర్ దర్శకుడితో రాజ్ తరుణ్ సినిమా
X
ఉయ్యాల జంపాల సినిమాతో పేరుతెచ్చుకున్నాడు రాజ్ తరుణ్. తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు సినిమాల విషయంలో దూకుడు పెంచాడు. రీసెంట్ గా సినిమా చూపిస్త మామ అంటూ మనముందుకొచ్చాడు. ఉయ్యాల జంపాల హీరోయిన్ అవికా గౌర్ తో కలిసి ఈ సినిమాలో నటించాడు రాజ్ తరుణ్. ఓ డిఫరెంట్ మూవీగా పేరుతెచ్చుకుంది సినిమా చూపిస్త మామ. ఈ మూవీతో పాటు ప్రస్తుతం సూర్యప్రతాప్ దర్శకత్వంలో కుమారి 21-ఎఫ్ అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు రాజ్ తరుణ్. ఈ ఏడాది చివరి నాటికి ఇది విడుదలవుతుంది. అయితే ఇప్పటివరకు రాజ్ తరుణ్ చేసిన ఈ 3 సినిమాలు కొత్త దర్శకులతో తెరకెక్కించినవే. అందుకే ఇకపై సీనియర్లతో సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు ఈ కుర్రహీరో. అందుకే ఏకంగా వెరీ సీనియర్ దర్శకుడు వంశీతో కలిసి సినిమా ప్లాన్ చేశాడు. కామెడీ ఎంటర్ టైనర్లకు పెట్టింది పేరైన వంశీ, రాజ్ తరుణ్ ను కాస్త భిన్నంగా చూపించడానికి సిద్ధమౌతున్నాడు. ఇతని సినిమాల్లో హీరో గోదావరి యాసలో మాట్లాడతాడు. రాజ్ తరణ్ ఎలాగూ ఆ విషయంలో వందశాతం మార్కులు తెచ్చుకున్నాడు కాబట్టి.. త్వరలోనే వీళ్లిద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్తారు.
First Published:  17 Aug 2015 5:00 AM GMT
Next Story