Telugu Global
Others

వైఎస్సార్ కాంగ్రెస్ నేత అరెస్టుతో న‌గ‌రిలో ఉద్రిక్త‌త‌

చిత్తూరు జిల్లా న‌గ‌రి ప‌ట్ట‌ణంలో వైఎస్ ఆర్‌సీపీ ప్ర‌జా ప్ర‌తినిధి ఇంటి వ‌ద్ద పోలీసులు జులుం ప్ర‌ద‌ర్శించారు. ఒక కేసులో ద‌ర్యాప్తులో భాగంగా చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ భర్త, మాజీ ఛైర్మన్‌ కెజె కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గేట్లు ప‌గుల‌గొట్టి మ‌రీ లోప‌ల‌కు వెళ్లేందుకు పోలీసులు ప్ర‌య‌త్నించ‌డంతో ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. రెండ్రోజుల కింద నగరి మున్సిపల్‌ కమిషనర్‌ బాలాజి యాదవ్‌పై ఛైర్‌పర్సన్‌ కుమారుడు కెజె సురేష్‌ దాడిచేసిన‌ట్లు ఆరోప‌ణ‌లొచ్చాయి. బాలాజి యాదవ్‌ […]

వైఎస్సార్ కాంగ్రెస్ నేత అరెస్టుతో న‌గ‌రిలో ఉద్రిక్త‌త‌
X
చిత్తూరు జిల్లా న‌గ‌రి ప‌ట్ట‌ణంలో వైఎస్ ఆర్‌సీపీ ప్ర‌జా ప్ర‌తినిధి ఇంటి వ‌ద్ద పోలీసులు జులుం ప్ర‌ద‌ర్శించారు. ఒక కేసులో ద‌ర్యాప్తులో భాగంగా చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ భర్త, మాజీ ఛైర్మన్‌ కెజె కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గేట్లు ప‌గుల‌గొట్టి మ‌రీ లోప‌ల‌కు వెళ్లేందుకు పోలీసులు ప్ర‌య‌త్నించ‌డంతో ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. రెండ్రోజుల కింద నగరి మున్సిపల్‌ కమిషనర్‌ బాలాజి యాదవ్‌పై ఛైర్‌పర్సన్‌ కుమారుడు కెజె సురేష్‌ దాడిచేసిన‌ట్లు ఆరోప‌ణ‌లొచ్చాయి. బాలాజి యాదవ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సురేష్‌ను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. అయితే ఆ కేసులో సురేష్ తండ్రి కుమార్‌ను కూడా అరెస్టు చేసేందుకు ఇంటికి వెళ్లారు. ఆయన ఇంట్లోంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో కరెంటు, సిసి కెమెరాలు ఆఫ్‌ చేశారు. ఎట్టకేలకు బయటకు వచ్చిన కుమార్‌ను అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులకూ, కుమార్‌కూ మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు కుమార్‌ను బలవంతంగా వాహనంలో స్టేషన్‌కు తరలించారు. ఆయన అరెస్టుతో ఉద్రిక్తత ఏర్పడడంతో నగరి, పుత్తూరు ప్రాంతాల్లో పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. దీనికి నిరసనగా వైఎస్‌ఆర్‌ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. అధికార పార్టీ ప్రోద్బ‌లంతోనే పోలీసులు అతి చేస్తున్నార‌ని, ప్ర‌తిప‌క్షాల‌పై జులుం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శించింది.
ధైర్యంగా ఉండండి : జ‌గ‌న్‌
చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్‌ చైర్మన్‌ శాంతకుమారి నివాసంపై పోలీసులు దాడి చేయడాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఘటనపై శాంతకుమారితో ఫోన్‌లో మాట్లాడిన ఆయన పోలీసుల దాడులను ఎదుర్కొందామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం వేధింపులు శృతి మించుతున్నాయని, వాటిని తిప్పి కొడతామ‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు.
ముఖ్య‌మంత్రి ఇంటి ముందు ధ‌ర్నా చేస్తా : రోజా
వైఎస్ఆర్ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం మానుకోకపోతే ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తానని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కె రోజా హెచ్చరించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్‌పాండ్‌లో చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్‌ చైర్మన్‌ శాంతాకుమారి భర్త కె.జె కుమార్‌ను అరెస్ట్‌పై స్పందించిన ఆమె ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరి మున్సిపల్‌ కమీషనర్‌గా శాడిస్టును నియమించారని, ఆయనను అడ్డుపెట్టుకుని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్‌ చైర్మన్‌ శాంతకుమారి భర్తను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారని, అర్ధరాత్రి గేట్లు పగలగొట్టి అధుపులోకి తీసుకోవాల్సినంత నేరం ఆయన ఏం చేశారని రోజా ప్రశ్నించారు.
First Published:  17 Aug 2015 1:19 AM GMT
Next Story