Telugu Global
NEWS

జూట్ మిల్లు ఎదుటే కార్మికుల 'వంటా వార్పు'

గత 45 రోజులుగా జూట్‌ మిల్లు కార్మికులు చేస్తున్న ఆందోళన కొత్త బాట పట్టింది. మిల్లును తెరిపించక పోవడం వల్ల కార్మికులు పస్తులతో అల్లాడుతున్నారు. అయినా యాజమాన్యం, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కార్మికులు ఏకంగా యాజమాన్య కార్యాలయం ముట్టడించారు. అక్కడే వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విపక్ష నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసే జీవోలు కార్మికుల పక్షాన ఉన్నట్లు కనిపిస్తున్నాయని, కాని యజమానులకు అనుకూలంగా చట్టం చేసిందని విమర్శించారు. ప్రభుత్వం […]

జూట్ మిల్లు ఎదుటే కార్మికుల వంటా వార్పు
X
గత 45 రోజులుగా జూట్‌ మిల్లు కార్మికులు చేస్తున్న ఆందోళన కొత్త బాట పట్టింది. మిల్లును తెరిపించక పోవడం వల్ల కార్మికులు పస్తులతో అల్లాడుతున్నారు. అయినా యాజమాన్యం, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కార్మికులు ఏకంగా యాజమాన్య కార్యాలయం ముట్టడించారు. అక్కడే వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విపక్ష నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసే జీవోలు కార్మికుల పక్షాన ఉన్నట్లు కనిపిస్తున్నాయని, కాని యజమానులకు అనుకూలంగా చట్టం చేసిందని విమర్శించారు. ప్రభుత్వం రియల్ ఎస్టేటర్లు, యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరించడం వల్లే ఆందోళన చేయాల్సి వస్తుందన్నారు. చట్టాలను కార్మికులకు అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. యాజమాన్యంపై వత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని, ప్రభుత్వ ఉదాసీన వైఖరి ఉండడం వల్లే యాజమాన్యంలో ఎలాంటి స్పందన లేదన్నారు. సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఇక్కడే వంటవార్పు నిర్వహిస్తామని, ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామన్నారు. ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరిపారని, జీవోలు కూడా ఇచ్చారని కానీ ఎలాంటి ఫలితం రాలేదన్నారు.
First Published:  18 Aug 2015 6:20 AM GMT
Next Story