రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి సతీ వియోగం

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సతీవియోగం కలిగింది. ఇవాళ ప్రణబ్ సతీమణి సుబ్రా ముఖర్జీ కన్నుముశారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఆగస్టు తొలివారంలో ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్చారు. మొదట్లో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఆగస్టు 8న ఆమె ఆరోగ్యం విషమించినట్లు వైద్యులు చెప్పారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆ సమయానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒడిషా పర్యటనలో ఉన్నారు. విషయం తెలుసుకుని ఆయన తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని న్యూఢిల్లీ వచ్చేశారు. అప్పటి నుంచి ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. క్రమంగా క్షిణించి సోమవారం ఉదయం కన్నుమూశారు.