Telugu Global
Cinema & Entertainment

పులి సినిమా  18 నిముషాలు లీక్..!

త‌మిళ స్టార్ హీరోల్లో ఒక‌రైన విజ‌య్ .. డైరెక్ష‌న్ శింబు దేవ‌న్  తో క‌ల‌సి  పులి అనే సోషియో ఫాంటసి చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే.  దాదాపు ఒక గంట సేపు విజువ‌ల్ ఎఫెక్ట్స్ వుంటాయ‌ని స‌మాచారం.  శ్రీ‌దేవి  కీ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో .. శృతిహాస‌న్,  హ‌న్సిక  హీరోయిన్స్ గా చేస్తున్నారు.  అయితే ఈ సినిమా కు సంబంధించి  18  నిముషాల నిడివి వున్న వీడియో ఫుటేజి లీక్ అయ్యింద‌ని   చిత్ర యూనిట్  ఆందోళ‌న […]

పులి సినిమా  18 నిముషాలు లీక్..!
X

త‌మిళ స్టార్ హీరోల్లో ఒక‌రైన విజ‌య్ .. డైరెక్ష‌న్ శింబు దేవ‌న్ తో క‌ల‌సి పులి అనే సోషియో ఫాంటసి చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. దాదాపు ఒక గంట సేపు విజువ‌ల్ ఎఫెక్ట్స్ వుంటాయ‌ని స‌మాచారం. శ్రీ‌దేవి కీ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో .. శృతిహాస‌న్, హ‌న్సిక హీరోయిన్స్ గా చేస్తున్నారు. అయితే ఈ సినిమా కు సంబంధించి 18 నిముషాల నిడివి వున్న వీడియో ఫుటేజి లీక్ అయ్యింద‌ని చిత్ర యూనిట్ ఆందోళ‌న ప‌డుతుంది.

లీక్ అయ్యిన వీడియో లో కథ ప్రకారం…విజయ్ గర్ల్ ప్రెండ్ నందిత శ్వేత…కొందరి చేతిలో దారుణంగా చంపబడుతుంది. ఆ భాధ ని తట్టుకోలేని విజయ్ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగా ఓ కొండమీద నుంచి దూకేస్తాడు. అయితే చిత్రంగా అతను ఓ కొత్త ప్లేస్ లోకి వెళ్తాడు. అక్కడ శ్రీదేవి రాణిగా చేస్తూంటుందట‌. అక్కడ విజయ్ పాపులారిటి పెరిగిపోతూండటంతో అక్కడ సైన్యాధిపతి సుదీప్ కుట్ర చేసి ఓ తప్పుడు గొడవలో ఇరికిస్తాడని. అతనిమీద పడిన నిందని నమ్మని శ్రీదేవి తన శక్తులతో అతని గతం చదువుతుందట‌. అతని గతంలో …విజయ్ మరెవరో కాదు తన తప్పిపోయిన కుమారుడే అని తెలుస్తుంద‌ట‌. అప్పుడు శ్రీదేవి ఏంచేసింది.? విజయ్ ఏం నిర్ణయం తీసుకున్నాడనేది మిగతా కథ అంటున్నారు.!
పులి సినిమాను త‌మిళ్ తో పాటు.. తెలుగు, హింది భాష‌ల్లోకి డ‌బ్బింగ్ చేసి ఏక కాలంలో మూడు భాష‌ల్లోను రిలీజ్ చేయ‌డానికి స‌న్న‌హాలు చేస్తున్నారు.గ‌త యేడాది క‌త్తి చిత్రంతో బాక్సాఫీస్ వ‌ద్ద త‌న స‌త్తాను చాటిని విజ‌య్.. పులి చిత్రంతో మ‌రోసారి గ‌ర్జిస్తాడ‌ని అభిమానుల న‌మ్మ‌కం మ‌రి. మ‌రి లీకేజ్ అయిన ఫుటేజ్ విష‌యంలో ప్రొడ్యూస‌ర్స్ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోంటార‌నే టాక్ వినిపిస్తుంది.

First Published:  17 Aug 2015 7:03 PM GMT
Next Story