Telugu Global
Cinema & Entertainment

రాజమౌళి 3000 కోట్ల సినిమా వస్తుంది: వర్మ

తెలుగు సినిమా చరిత్రను తిరగ రాసిన ఎస్‌ ఎస్‌ రాజమౌళి తనకు ఓ కథ చెప్పాడని, ఆ కథతో వెయ్యి కోట్లను టార్గెట్ చేస్తున్నట్లు చెప్పాడని దర్శకుడు రాంగోపాలవర్మ తెలిపాడు. అయితే ఆ కథ విన్నాక 1000 కోట్లు ఖర్చు పెట్టి తీసే ఈ సినిమా 3000 కోట్లు వసూలు చేయొచ్చని తాను భావిస్తున్నానని చెప్పాడు. బాహుబలి-2 పూర్తయిన తరువాత రాజమౌళి ఈ ప్రాజెక్ట్ విషయాలు ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే ఈ చిత్రం ఎవరితో రూపొందించేది మాత్రం […]

రాజమౌళి 3000 కోట్ల సినిమా వస్తుంది: వర్మ
X
తెలుగు సినిమా చరిత్రను తిరగ రాసిన ఎస్‌ ఎస్‌ రాజమౌళి తనకు ఓ కథ చెప్పాడని, ఆ కథతో వెయ్యి కోట్లను టార్గెట్ చేస్తున్నట్లు చెప్పాడని దర్శకుడు రాంగోపాలవర్మ తెలిపాడు. అయితే ఆ కథ విన్నాక 1000 కోట్లు ఖర్చు పెట్టి తీసే ఈ సినిమా 3000 కోట్లు వసూలు చేయొచ్చని తాను భావిస్తున్నానని చెప్పాడు. బాహుబలి-2 పూర్తయిన తరువాత రాజమౌళి ఈ ప్రాజెక్ట్ విషయాలు ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే ఈ చిత్రం ఎవరితో రూపొందించేది మాత్రం వర్మ చెప్పలేదు. మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్‌ కల్యాణ్‌… వీరిలో ఎవరో ఒకరు ఈ సినిమాలో హీరోగా ఉంటారని ఫిలింనగర్‌లో చర్చ నడుస్తుంది. ఆ లక్కీ హీరో ఎవరో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
First Published:  18 Aug 2015 7:12 PM GMT
Next Story