Telugu Global
Family

వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారు? (Devotional)

అబిన్‌ అల్సర్‌ చిన్నపుడు అతని తండ్రిని ఒక దర్విష్‌కు (గురువుకు) మధ్య జరిగిన సంభాషణ ఎప్పుడూ మరిచిపోలేదు. అతని తండ్రి, దర్విష్‌ హాల్‌లో ఎదురెదురుగా కూర్చున్నారు. దర్విష్‌ “నీ పని గురించి జాగ్రత్త పడు. నువ్వు చేసే పని గురించి స్పృహతో ఉండు. ఏపని చేసినా భవిష్యత్‌ తరాలు దాన్ని గురించి చెప్పుకునేలా ఉండాలి. అందుకని ఏపనీ నిర్లక్ష్యంగా చెయ్యకూడదు” అన్నాడు. అబిన్‌ అల్సర్‌ తండ్రి “అసలు ఈ మాటలకు అర్థముందా? నేను చనిపోయాక ఎవరేమనుకుంటే నాకేమిటి? […]

అబిన్‌ అల్సర్‌ చిన్నపుడు అతని తండ్రిని ఒక దర్విష్‌కు (గురువుకు) మధ్య జరిగిన సంభాషణ ఎప్పుడూ మరిచిపోలేదు.

అతని తండ్రి, దర్విష్‌ హాల్‌లో ఎదురెదురుగా కూర్చున్నారు.

దర్విష్‌ “నీ పని గురించి జాగ్రత్త పడు. నువ్వు చేసే పని గురించి స్పృహతో ఉండు. ఏపని చేసినా భవిష్యత్‌ తరాలు దాన్ని గురించి చెప్పుకునేలా ఉండాలి. అందుకని ఏపనీ నిర్లక్ష్యంగా చెయ్యకూడదు” అన్నాడు.

అబిన్‌ అల్సర్‌ తండ్రి “అసలు ఈ మాటలకు అర్థముందా? నేను చనిపోయాక ఎవరేమనుకుంటే నాకేమిటి? దాంతో నాకేమిటి సంబంధం?” అన్నాడు లెక్కలేకుండా.

ఈ మాటలు అబిన్‌ అల్సర్‌ మనసులో ముద్ర వేసుకున్నాయి. జీవితాంతం అతను మరచిపోలేదు. అతని జీవితమంతా ఏపని చేసినా మంచే చెయ్యడానికి ప్రయత్నించాడు. అర్థవంతమయిన పనులు చేశాడు. పదిమందిని ఆదుకున్నాడు, సాయపడ్డాడు. చేసేపనిని ఆనందంగా ఉత్సాహంగా చేశాడు. అతని ఔదార్యం అతన్ని అందరూ గుర్తుంచుకునేలా చేసింది. అతను జీవించినపుడే అందరితోనూ గుర్తింపబడ్డాడు. అతని మరణానంతరం అతను చేసిన పనులవల్ల అతని పట్టణం ఎంతో అభివృద్ధి చెందింది.

అతని సమాధిఫలకం మీద అతని కోరికమేరకు ఇలా రాయించారు.

“మరణంతో అంతమయిన జీవితం నిజంగా జీవించిన జీవితం కాదు”.

– సౌభాగ్య

First Published:  18 Aug 2015 1:01 PM GMT
Next Story