Telugu Global
Cinema & Entertainment

సొంత సినిమా అయితే  అన్నీ వ‌స్తాయి..! 

ఒక‌ప్పుడు  మ‌హేష్ బాబు  మీడియాతో మాట్లాడ‌ట‌మే అరుదు. ఆడియో రోజు మాట్లాడే  నాలుగు మాట‌లే  అభిమానుల‌కు పండ‌గ‌.   విడుద‌లైన త‌రువాత  ప్రెస్  మీట్స్ కు రావ‌డం కానీ.. సినిమా ప్ర‌చారం చేయ‌డం కానీ  చాల అరుదు.   అయితే ఖ‌లేజా సినిమా నుంచి కాస్తా  ప‌ద్ద‌తి మారింది.  ఆ చిత్రం  మొద‌టి రోజు   నెగిటివ్ టాక్ తెచ్చుకోవ‌డంతో..   మీడియాకు ఇంట‌ర్వూలు  ఇచ్చారు. సినిమా ప్ర‌మోట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.  ఆ త‌రువాత దూకుడు […]

సొంత సినిమా అయితే  అన్నీ వ‌స్తాయి..! 
X
ఒక‌ప్పుడు మ‌హేష్ బాబు మీడియాతో మాట్లాడ‌ట‌మే అరుదు. ఆడియో రోజు మాట్లాడే నాలుగు మాట‌లే అభిమానుల‌కు పండ‌గ‌. విడుద‌లైన త‌రువాత ప్రెస్ మీట్స్ కు రావ‌డం కానీ.. సినిమా ప్ర‌చారం చేయ‌డం కానీ చాల అరుదు. అయితే ఖ‌లేజా సినిమా నుంచి కాస్తా ప‌ద్ద‌తి మారింది. ఆ చిత్రం మొద‌టి రోజు నెగిటివ్ టాక్ తెచ్చుకోవ‌డంతో.. మీడియాకు ఇంట‌ర్వూలు ఇచ్చారు. సినిమా ప్ర‌మోట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఆ త‌రువాత దూకుడు సినిమాకు ఫరవాలేదు.
ఇక తాజాగా మ‌హేష్ బాబు శ్రీ‌మంతుడు చిత్రం కోసం ఒక రేంజ్ లో ప్ర‌చారం చేస్తున్నాడు. త‌న కెరీర్ లో ఇంత వ‌ర‌కు ఈ రేంజ్ లో సినిమా కోసం ఇంట‌ర్వూలు ఇచ్చిన దాఖ‌లాలు లేవు. ఈ సినిమా కోసం మ‌హేష్ మీడియాలో క‌న‌బ‌డుతున్న తీరు చూస్తుంటే.. అభిమానుల‌కే దిమ్మ తిరుగుతుంది. అంటే ..ఎప్పుడు లేనిది మ‌హేష్ బాబు ప్ర‌చారం బాగా చేస్తున్నాడ‌నే ఒక విధ‌మైన ఆశ్య‌ర్యం. ఇదిలా వుంటే.. మొన్న రాత్రి ఒక ప్ర‌వైట్ హోట‌ల్లో మ‌హేష్ బాబు ఎలక్ర్టానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి ప్ర‌త్యేకంగా పార్టీ కూడా ఇచ్చార‌ట‌. వారితో స‌ర‌ద‌గా క‌బుర్లు చెప్పుకుంటూ.. అంద‌రీకి సినిమాను ప్ర‌మోట్ చేసినంద‌కు ధ‌న్య వాదాలు తెలిపార‌ట‌. ఆయ‌నే స్వ‌యంగా ఇంట‌ర్వూలు ( చానెల్స్ కు ) ఇస్తున్నారు. ఇదంతా ఎందుకు ? మ‌హేష్ లో ఒక్క‌సారిగా ఇంత మార్పు ఏమిటి..? సింపుల్ శ్రీ‌మంతుడు చిత్రంతో ప్రొడ్యూస‌ర్ అవ‌తారం ఎత్తాడు . ఎంతైన సొంత సినిమా క‌దా.? అందుకే అంత ఓపిక‌.. అంత ప్ర‌చారం అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజ‌మే కదా..? ఎంతైనా సొంత సినిమా అంటే ఈ మాత్రం చేయాల‌నే ఫోర్స్ ఉంటుంది క‌దా.!
First Published:  19 Aug 2015 12:29 AM GMT
Next Story