Telugu Global
Cinema & Entertainment

ఆ హీరోతో రొమాన్స్ కి పోటిపడుతున్న శృతి, నయన్

ఇప్పటికే ఎంతోమంది గొప్ప దర్శకులతో పనిచేసింది నయనతార. ది గ్రేట్ డైరక్టర్ బాపుతో కూడా కలిసి పనిచేసింది. ఇప్పుడు మరో గొప్ప దర్శకుడి కన్ను నయన్ పై పడింది. కుదిరితే తన కొత్త సినిమాకు నయన్ ను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నాడు మణిరత్నం. ఈ విషయం తెలిసిన నయనతార కూడా మణిరత్నం అడిగినవెంటనే ఇవ్వడానికి కాల్షీట్లు సిద్ధంగా పెట్టుకుంది. ఓకే బంగారం సినిమాతో హిట్ కొట్టిన మణిరత్నం అందులో హీరోగా నటించిన దుల్కర్ సల్మాన్ తో […]

ఆ హీరోతో రొమాన్స్ కి పోటిపడుతున్న శృతి, నయన్
X
ఇప్పటికే ఎంతోమంది గొప్ప దర్శకులతో పనిచేసింది నయనతార. ది గ్రేట్ డైరక్టర్ బాపుతో కూడా కలిసి పనిచేసింది. ఇప్పుడు మరో గొప్ప దర్శకుడి కన్ను నయన్ పై పడింది. కుదిరితే తన కొత్త సినిమాకు నయన్ ను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నాడు మణిరత్నం. ఈ విషయం తెలిసిన నయనతార కూడా మణిరత్నం అడిగినవెంటనే ఇవ్వడానికి కాల్షీట్లు సిద్ధంగా పెట్టుకుంది. ఓకే బంగారం సినిమాతో హిట్ కొట్టిన మణిరత్నం అందులో హీరోగా నటించిన దుల్కర్ సల్మాన్ తో పాటు కార్తిని హీరోలుగా పెట్టి ఓ సినిమా ప్లాన్ చేశాడు. ఈ సినిమాను 3 నెలల్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు. అయితే హీరోయిన్ ను మాత్రం ఇంకా కన్ ఫర్మ్ చేయలేదు. ప్రస్తుతం అతడి దృష్టిలో నయన్ తో పాటు శృతిహాసన్, కీర్తి సురేష్ పేర్లు కూడా ఉన్నాయి. మరి ఈ ముగ్గుర్లో మణిరత్నం ఎవరికి ఛాన్స్ ఇస్తాడో చూడాలి. అటు నయనతార మాత్రం మణిరత్నంతో కలిసి పనిచేయాలనుందని ఇప్పటికే ప్రకటించి తన ఆసక్తిని కనబరిచింది. మరోవైపు శృతిహాసన్ ను తీసుకోమని కమల్ హాసన్ రికమెండ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. సో.. ప్రస్తుతం ఈ సినిమా ఛాన్స్ శృతిహాసన్, నయనతార మధ్య దోబూచులాడుతోంది.
First Published:  18 Aug 2015 7:00 PM GMT
Next Story