Telugu Global
Others

హాట్‌ టాపిక్‌గా మారిన ఏపీ ప్రత్యేక హోదా!

ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఎన్నికల నేపథ్యంలో బీహార్‌ రాష్ట్రానికి 1.25 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం… ఏపీని ఎందుకు విస్మరిస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని అంశాలను అమలు చేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందని కాంగ్రెస్‌ ప్రశ్నిస్తోంది. ప్రత్యేక హోదా వచ్చే వరకు చంద్రబాబు ఢిల్లీలోనే ఉండాలని, హోదాతోపాటు వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని తేవాల్సిన బాధ్యత కూడా […]

హాట్‌ టాపిక్‌గా మారిన ఏపీ ప్రత్యేక హోదా!
X
ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఎన్నికల నేపథ్యంలో బీహార్‌ రాష్ట్రానికి 1.25 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం… ఏపీని ఎందుకు విస్మరిస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని అంశాలను అమలు చేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందని కాంగ్రెస్‌ ప్రశ్నిస్తోంది. ప్రత్యేక హోదా వచ్చే వరకు చంద్రబాబు ఢిల్లీలోనే ఉండాలని, హోదాతోపాటు వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని తేవాల్సిన బాధ్యత కూడా ఆయన మీదే ఉందని ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అంటున్నారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్‌ను వంచిస్తున్నాయని వైఎస్‌ఆర్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ఆపార్టీ నేతలు విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడితే రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై పోరు తప్పదని హెచ్చరించారు. తమ పార్టీకి లబ్ది చేకూరుతుందనుకుంటేనే కేంద్రం నిధులు విడుదల చేస్తుందని.. లేదంటే రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీహార్‌ ఎన్నికల వేళ ఇతర పార్టీలకు ఓట్లు పడకుండా చేయడానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని, మరి ఆంధ్రప్రదేశ్‌ పట్ల ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా ఈనెల 29న ఏపీ బంద్‌ తలపెట్టినట్లు వైసీపీ నేతలు తెలిపారు.
కాగా స్పెషల్‌ స్టేటస్‌ విషయంలో బీజేపీని అపఖ్యాతిపాలు చేసేందుకు విష ప్రచారం చేస్తున్నారని ఏపీ రాష్ట్ర మంత్రి మాణిక్యాలరావు విమర్శించారు. విభజన సమయంలో తమ పార్టీ నేతలు తప్ప ఏ పార్టీ వారు కూడా సరైన సూచనలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్‌ వల్లే అడ్డగోలు విభజన జరిగిందని మాణిక్యాలరావు విమర్శించారు. మొత్తానికి అధికార విపక్ష నేతల మాటలతో స్పెషల్‌ స్టేటస్‌ అంశం ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌ టాఫిక్‌గా మారింది. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి ఎలాంటి ప్రతిపాదనలు చేయాలనే విషయంలో కసరత్తు చేస్తోందని, ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వంపైనో, రాష్ట్ర ప్రభుత్వంపైనో విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు.
First Published:  19 Aug 2015 1:44 AM GMT
Next Story