Telugu Global
Others

అక్ర‌మ క‌ట్ట‌డాలకు రాజ‌ముద్ర‌

బాబు ఇంటి కోసం రాజీ  రాజు త‌ల‌చుకుంటే దెబ్బ‌ల‌కు కొద‌వేముంటుంది? ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నివాసం కోసం తెలుగుదేశం ప్ర‌భుత్వం అనేక విధాలుగా రాజీ ప‌డిపోతున్న‌ది. అనేక అక్ర‌మ క‌ట్ట‌డాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేస్తోంది. కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట దిగువ‌భాగంలో అనుమ‌తులు లేకుండా అనేక క‌ట్ట‌డాలు ఉన్నాయి. వాటిలో మూడు మిన‌హా అన్నీ అక్ర‌మక‌ట్ట‌డాలేన‌ని అధికారులు గ‌తంలో ఒక నివేదిక ఇచ్చారు. అయితే ఆ ప్రాంతంలో ముఖ్య‌మంత్రి తాత్కాలిక నివాసం ఏర్పాట‌వుతుండ‌డంతో ఆ ఆక్ర‌మ క‌ట్ట‌డాల‌న్నిటిని రెగ్యుల‌రైజ్ […]

అక్ర‌మ క‌ట్ట‌డాలకు రాజ‌ముద్ర‌
X
బాబు ఇంటి కోసం రాజీ
రాజు త‌ల‌చుకుంటే దెబ్బ‌ల‌కు కొద‌వేముంటుంది? ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నివాసం కోసం తెలుగుదేశం ప్ర‌భుత్వం అనేక విధాలుగా రాజీ ప‌డిపోతున్న‌ది. అనేక అక్ర‌మ క‌ట్ట‌డాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేస్తోంది. కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట దిగువ‌భాగంలో అనుమ‌తులు లేకుండా అనేక క‌ట్ట‌డాలు ఉన్నాయి. వాటిలో మూడు మిన‌హా అన్నీ అక్ర‌మక‌ట్ట‌డాలేన‌ని అధికారులు గ‌తంలో ఒక నివేదిక ఇచ్చారు. అయితే ఆ ప్రాంతంలో ముఖ్య‌మంత్రి తాత్కాలిక నివాసం ఏర్పాట‌వుతుండ‌డంతో ఆ ఆక్ర‌మ క‌ట్ట‌డాల‌న్నిటిని రెగ్యుల‌రైజ్ చేసేస్తున్నారు. ఆ ప్ర‌క్రియ‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు. తాడేప‌ల్లి, తుళ్లూరు మండ‌లాల్లోని దాదాపు 22 అక్ర‌మ క‌ట్ట‌డాల రెగ్యుల‌రైజేష‌న్‌కు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇంత‌కీ ఈ అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను ఎందుకు రెగ్యుల‌రైజ్ చేస్తున్నారా అని ఆరా తీస్తే… ముఖ్య‌మంత్రి నివాసం కోస‌మ‌ని తేలింది. ముఖ్య‌మంత్రి నివాసం కోస‌మైనా అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను ఎందుకు రెగ్యుల‌రైజ్ చేయాలి? ఎందుకంటే ముఖ్య‌మంత్రి తాత్కాలిక నివాసంగా ఎంపిక చేసిన భ‌వ‌నం కూడా అక్ర‌మ క‌ట్ట‌డ‌మేన‌ట‌. గ‌తంలో రెవెన్యూ అధికారులు ఈ విష‌యాన్ని నిర్ధారించారు కూడా. అదే విష‌యాన్ని ఓ నోటీసులో ప్ర‌స్తావించి ఆ భ‌వ‌నానికి కూడా అంటించారు. ఇపుడు ముఖ్య‌మంత్రి నివాసం స‌క్ర‌మ‌మైన‌దేన‌ని తేల్చాలంటే మిగిలిన అన్న అక్ర‌మ క‌ట్ట‌డాలూ స‌క్ర‌మ‌మైన‌వేన‌ని ప్ర‌భుత్వ‌మే క్లీన్ చిట్ ఇవ్వాలి. అందుకే వాటి య‌జ‌మానులంతా ఇపుడు సంతోషాల‌లో మునిగి తేలుతున్నారు. చంద్ర‌బాబు లాంటి వారు ఉంటే త‌మ లాంటి వారికి పండ‌గేన‌ని చ‌ర్చించుకుంటున్నారు. చంద్ర‌బాబుకు ఆ నివాసం, ప‌రిస‌రాలు న‌చ్చ‌డం వ‌ల్ల‌నే అధికారులు, మంత్రులు ఇక చేసేదేమీ లేక మిన్న‌కుండిపోయారు. ఆ భ‌వ‌నం అభివృద్ధికి, స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చి దిద్ద‌డానికి అవ‌స‌ర‌మైన నిధుల‌ను కూడా ముఖ్య‌మంత్రే మంజూరు చేసేశారు. దాంతో ప‌నులు చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి. ముఖ్య‌మంత్రి నివాసానికి దారితీసే మార్గం వెడ‌ల్పు చేయ‌డం వంటి ప‌నులు కూడా పూర్త‌వుతున్నాయి. అందుకోసం కొంత మంది రైతుల పొలాల‌ను కూడా బ‌ల‌వంతంగా లాక్కోవ‌డం, ఆ రైతులు రోజూ ఆందోళ‌న‌లు చేస్తుండడం కూడా వార్త‌ల్లో క‌నిపిస్తున్నాయి.
First Published:  18 Aug 2015 11:47 PM GMT
Next Story