Telugu Global
Others

ఎడ్యుకేషన్‌ హబ్‌గా ఏపీ: స్మృతి ఇరానీ

ఆంధ్రప్రదేశ్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చాలని సీఎం చంద్రబాబునాయుడు ఆకాంక్షిస్తున్నారని కేంద్రమంత్రి అన్నారు. తాడేపల్లిగూడెంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ( నిట్‌ ) శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ రెండు నెలల్లో నాలుగుసార్లు తాను ఏపీకి వచ్చానని, వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక విద్యాసంస్థకు శంకుస్థాపన చేశానని అన్నారు. ఏపీలో 4 విద్యాసంస్థలకు శంకుస్థాపన చేశానన్నారు.రూ.680 కోట్లతో విశాఖలో ఐఐఎం, రూ.700 కోట్లతో తిరుపతిలో ఐఐటీ రూ.300 కోట్లతో తాడేపల్లిగూడెంలో నిట్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతి […]

ఎడ్యుకేషన్‌ హబ్‌గా ఏపీ: స్మృతి ఇరానీ
X
ఆంధ్రప్రదేశ్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చాలని సీఎం చంద్రబాబునాయుడు ఆకాంక్షిస్తున్నారని కేంద్రమంత్రి అన్నారు. తాడేపల్లిగూడెంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ( నిట్‌ ) శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ రెండు నెలల్లో నాలుగుసార్లు తాను ఏపీకి వచ్చానని, వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక విద్యాసంస్థకు శంకుస్థాపన చేశానని అన్నారు. ఏపీలో 4 విద్యాసంస్థలకు శంకుస్థాపన చేశానన్నారు.రూ.680 కోట్లతో విశాఖలో ఐఐఎం, రూ.700 కోట్లతో తిరుపతిలో ఐఐటీ రూ.300 కోట్లతో తాడేపల్లిగూడెంలో నిట్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతి స్కూల్‌లో విద్యార్థినులకు టాయిలెట్స్‌ ఏర్పాటు చేయాలి కేంద్రమంత్రి సూచించారు. ఏపీని విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు ఆకాంక్ష స్మృతిఇరానీ పేర్కొన్నారు. విద్యాసంస్థలు పెట్టడంతోపాటు ప్రతి విద్యాసంస్థలో టాయిలెట్లు ఉండేట్టు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. రక్షాబంధన్‌ సందర్బంగా ప్రతి అన్న తన చెల్లెలికి కానుకగా ఓ టాయిలెట్‌ నిర్మించి ఇవ్వాలని ఆమె కోరారు. నిట్‌ కోసం మంత్రి మాణిక్యాలరావు తీవ్రంగా కృషి చేశారని, అందువల్లే తాడేపల్లిగూడేనికి ఈ విద్యాసంస్థ లభించిందని ఆమె అన్నారు. ప్రధాని నరేంద్రమోడి చేపట్టిన సామాజిక కార్యక్రమాలను చెబుతూ స్వచ్ఛ భారత్‌, పేదలకు ప్రమాద భీమా, సామాజిక భీమా కార్యక్రమాలను ఆమె ప్రస్తావించారు.
రెండేళ్ళలో చైనాకు ధీటుగా భారత్‌ : వెంకయ్య
ప్రపంచమంతా మోడి..మోడి.. అంటూ నామ స్మరణ చేస్తుంటే ఇక్కడ మాత్రం అనవసరంగా కాంగ్రెస్‌ తదితర చేతకాని పార్టీలు నోరుపారేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. మోడి ఏ దేశమేగినా ఆక్కడ ఆయనకు అపూర్వ స్వాగతం లభిస్తోందని, అమెరికా, చైనా, జపాన్… మొన్నటికి మొన్న దుబాయి… ఇలా ఏ దేశమెళ్ళినా వారివారి హోదాలను పక్కన పెట్టి అధ్యక్షులు, ప్రధానమంత్రులు, రాజులు ఆయనకు ఆహ్వానం పలుకుతున్నారని గుర్తు చేశారు. ఇపుడున్నట్టుగా మనం ముందుకు వెళితే మరో రెండేళ్ళలో భారత్‌ చైనాను మించిపోతుందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పెట్టిందంటే మన ప్రగతి పథం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. ఇలాంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి కొంతమంది స్వార్థపరులు, రాజకీయ నిరుద్యోగులు ప్రయత్నిస్తున్నారని వెంకయ్య ఆరోపించారు. భూములు తీసుకోకూడదని కొందరంటారు… కొత్త నిర్మాణాలు ఆకాశంలో కట్టాలా అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కావాలంటూ కొంతమంది యాగీ చేస్తున్నారు. 50 యేళ్ళు పాలించిన వారు అప్పుడెందుకు ఆంధ్రాకు సాయం చేయలేదు. ఏపీని ఎందుకీ దుస్థితికి తెచ్చారు అని ప్రశ్నించారు. ఒక్క యేడాదిలోనే అన్నీ చేసేయాలంటే సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించారు. త్వరలోనే బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఏపీకి ఏంచేసిందో… ఇకముందు ఏం చేస్తుందో వెల్లడిస్తామని వెంకయ్యనాయుడు చెప్పారు.
ఏపీ నేనొస్తే ఒక ప్రాజెక్టు వచ్చినట్టే
తనను ఆంధ్రప్రదేశ్‌కు రావొద్దంటున్నారని, తాను వస్తే ఒక్కోసారి ఒక్కో ప్రాజెక్టు వస్తుందని, నిరసనలు లెక్క చేసే వ్యక్తిని తాను కాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. తాను అసలు ఈ రాష్ట్రం నుంచే ఎన్నిక కాలేదని చెబుతూ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలతోపాటు తమ పార్టీతోపాటు పోతుపోతూ కాంగ్రెస్‌ పార్టీ నోటి మాటగా ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేరుస్తామని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలన్నీ క్రమంగా నెరవేరుస్తామని, చొక్కలు మార్చినట్టు పార్టీలు మార్చేవారు చెప్పే మాటల్ని నమ్మవద్దని వెంకయ్య అన్నారు. ఏపీకి సమర్ధుడైన ముఖ్యమంత్రి ఉన్నారని, రాష్ట్రం అభివృద్ధి చెందడం ఖాయమని చెప్పారు. త్వరలోనే మంగళగిరిలో నిమ్స్‌, ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్‌ వస్తుందని ఆయన తెలిపారు. విజయవాడ నుంచి ఢిల్లీకి ఎపీ ఎక్స్‌ప్రెస్‌ వేస్తే దాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ జిల్లాల నుంచి వెళ్ళేలా చర్యలు తీసుకున్నామని, ఇపుడు ఏపీ ఎక్స్‌ప్రెస్‌ విశాఖ నుంచి ప్రారంభమై తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా పయనిస్తోందని ఆయన తెలిపారు.
First Published:  20 Aug 2015 1:29 AM GMT
Next Story