Telugu Global
NEWS

ఫోన్ చేస్తే ఇంటికే వైద్య సేవ‌లు 

ఒక్క ఫోన్ చేస్తే చాలు రోగుల‌కు అవ‌స‌ర‌మైన ఏ వైద్య సేవ అయినా డాక్ట‌ర్లు ఇంటికే వ‌చ్చి అందిస్తార‌ని కాల్ హెల్త్ స‌ర్వీస్ సంస్థ సీఈవో హ‌రి చెప్పారు. పేషెంట్లు డాక్ట‌ర్ల కోసం ఆస్ప‌త్రుల్లో గంట‌ల త‌ర‌బ‌డి నిరీక్షంచే అవ‌స‌రం లేకుండా ఉండేందుకే కాల్‌హెల్త్ స‌ర్వీస్‌ను ప్రారంభించామ‌ని, సెప్టెంబ‌రు నుంచి ఈ సేవ‌ల‌ను హైదరాబాద్‌లో అందుబాటులోకి తెస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. న‌గ‌రంలోని ఏ ప్రాంతం నుంచి ఫోన్ చేసినా వారి ఇంటికి మెడిక‌ల్ ఆఫీస‌ర్ కొన్ని నిమిషాల్లోనే […]

ఫోన్ చేస్తే ఇంటికే వైద్య సేవ‌లు 
X
ఒక్క ఫోన్ చేస్తే చాలు రోగుల‌కు అవ‌స‌ర‌మైన ఏ వైద్య సేవ అయినా డాక్ట‌ర్లు ఇంటికే వ‌చ్చి అందిస్తార‌ని కాల్ హెల్త్ స‌ర్వీస్ సంస్థ సీఈవో హ‌రి చెప్పారు. పేషెంట్లు డాక్ట‌ర్ల కోసం ఆస్ప‌త్రుల్లో గంట‌ల త‌ర‌బ‌డి నిరీక్షంచే అవ‌స‌రం లేకుండా ఉండేందుకే కాల్‌హెల్త్ స‌ర్వీస్‌ను ప్రారంభించామ‌ని, సెప్టెంబ‌రు నుంచి ఈ సేవ‌ల‌ను హైదరాబాద్‌లో అందుబాటులోకి తెస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. న‌గ‌రంలోని ఏ ప్రాంతం నుంచి ఫోన్ చేసినా వారి ఇంటికి మెడిక‌ల్ ఆఫీస‌ర్ కొన్ని నిమిషాల్లోనే చేరుకుంటార‌ని అందుకోసం హైద‌రాబాద్‌లోని 28 ప్రాంతాల్లో కాల్ సెంట‌ర్లను ఏర్పాటు చేశామ‌ని ఆయ‌న చెప్పారు. రోగుల స‌మ‌స్య‌ను మెడిక‌ల్ ఆఫీస‌ర్ న‌యం చేస్తారు. న‌యం కాని ప‌క్షంలో ఇత‌ర ఆసుప‌త్రులు, డాక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా చికిత్స చేస్తారు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో మాత్ర‌మే పేషెంట్ల‌ను ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లిస్తార‌ని ఆయ‌న చెప్పారు. కాల్‌హెల్త్ సంస్థ‌లో 36 విభాగాల‌కు 64 మంది స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్లు ప‌ని చేస్తార‌ని ఆయ‌న చెప్పారు. కాల్ హెల్త్ సంస్థ స‌ర్వీస్‌ల‌ను హైద‌రాబాద్‌లో పూర్తిగా విస్త‌రించిన త‌ర్వాతే ఇత‌ర న‌గ‌రాల్లో ప్రారంభిస్తామ‌ని, రెండేళ్ల‌లో దేశ‌వ్యాప్తంగా సేవ‌లందిస్తామ‌ని సంస్థ ప్ర‌మోట‌ర్ రామ్ కో గ్రూపుకు చెందిన సంధ్యారాజు చెప్పారు. రామ్ కో సంస్థ కాల్‌హెల్త్ సంస్థలో రూ. 75 కోట్ల పెట్టుబ‌డులు పెట్టిన‌ట్లు స‌మాచారం.
First Published:  20 Aug 2015 2:04 AM GMT
Next Story