Telugu Global
Cinema & Entertainment

ఐస్ లాండ్ లో షారూక్, కాజోల్

ఈ జంట పేరుచెప్పగానే ఎవరికైనా డీడీఎల్ జే సినిమా గుర్తొస్తుంది. దిల్ వాలే దుల్హనియా లేజాయాంగే అంటూ కాజల్-షారూక్ సృష్టించిన మేనియా అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలంటే చెవికోసుకుంటారు చాలామంది. వాళ్లిద్దరి ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ కోసం పడిచచ్చిపోతారు. అందుకే మరోసారి షారూక్-కాజల్ కలిశారు. ఐదేళ్ల విరామం తర్వాత దిల్ వాలే సినిమాతో మనముందుకొస్తున్నారు. రోహిత్ షెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఐస్ ల్యాండ్ లో జరుగుతోంది. రొమాంటిక్ […]

ఐస్ లాండ్ లో షారూక్, కాజోల్
X
ఈ జంట పేరుచెప్పగానే ఎవరికైనా డీడీఎల్ జే సినిమా గుర్తొస్తుంది. దిల్ వాలే దుల్హనియా లేజాయాంగే అంటూ కాజల్-షారూక్ సృష్టించిన మేనియా అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలంటే చెవికోసుకుంటారు చాలామంది. వాళ్లిద్దరి ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ కోసం పడిచచ్చిపోతారు. అందుకే మరోసారి షారూక్-కాజల్ కలిశారు. ఐదేళ్ల విరామం తర్వాత దిల్ వాలే సినిమాతో మనముందుకొస్తున్నారు. రోహిత్ షెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఐస్ ల్యాండ్ లో జరుగుతోంది. రొమాంటిక్ కపుల్ గా పేరుతెచ్చుకున్న షారూక్-కాజోల్ తో అక్కడ ఓ రొమాంటిక్ సాంగ్ తీస్తున్నారు. కేవలం 12 రోజుల్లో సింగిల్ టేక్ తో, ఎలాంటి ఎడిటింగ్ చేయకుండా ఈ పాటను పూర్తిచేయాలని నిర్ణయించుకుంది టీం. అందుకు తగ్గట్టే ఫరాఖాన్ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. కృతి సనోన్, వరుణ్ ధావన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేస్తారు.
First Published:  19 Aug 2015 8:00 PM GMT
Next Story