Telugu Global
Health & Life Style

ఇక మహిళలకూ వయాగ్రా

మహిళలకు కూడా వయాగ్రా వచ్చేసింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మహిళల వయాగ్రాకు ఆమోదం తెలిపింది. ఇది వాడితే ఆరోగ్యపరంగా తలెత్తే సమస్యలపై పలు హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా మద్యం తాగే మగువలు దీని వాడకం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దీన్ని మద్యంతో కలిపి తీసుకోకూడదని స్పష్టం చేసింది. అలాగే కాలేయ సమస్యలకు వాడే కొన్ని మందులతో కలిపి తీసుకోవడం కూడా ప్రమాదకరమని హెచ్చరించింది. ఈ పిల్ వాడే మహిళలు వైద్య నిఫుణుల సలహాలను […]

ఇక మహిళలకూ వయాగ్రా
X
మహిళలకు కూడా వయాగ్రా వచ్చేసింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మహిళల వయాగ్రాకు ఆమోదం తెలిపింది. ఇది వాడితే ఆరోగ్యపరంగా తలెత్తే సమస్యలపై పలు హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా మద్యం తాగే మగువలు దీని వాడకం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దీన్ని మద్యంతో కలిపి తీసుకోకూడదని స్పష్టం చేసింది. అలాగే కాలేయ సమస్యలకు వాడే కొన్ని మందులతో కలిపి తీసుకోవడం కూడా ప్రమాదకరమని హెచ్చరించింది. ఈ పిల్ వాడే మహిళలు వైద్య నిఫుణుల సలహాలను పాటించాలని ఎఫ్‌డీయే సూచించింది. ‘యాడీ’ పేరుతో తయారైన ఈ పింక్ వయాగ్రా ప్రీ-మోనోపాజ్ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ దశలో సాధారణంగా కనిపించే లైంగిక అనాశక్తిని తగ్గించి వారిని ఆ సమయంలో ఉత్తేజితులను చేస్తుంది. లైంగిక అనాశక్తి ఉన్న మహిళలు వంద మిల్లి గ్రాముల వయాగ్రా టాబ్లెట్‌ను ప్రతిరోజు నిద్రకు ముందు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది 8 వారాలు వాడిన తర్వాత కూడా ఎలాంటి ఫలితం కనిపించకపోతే దీని వాడకాన్ని నిలిపివేయాలని అమెరికా ఎఫ్‌డీయే సూచించింది. పింక్ కలర్‌లో ఉండే ఈ ‘యాడీ’ వయాగ్రా మహిళల్లో లైంగిక పరమైన సమస్యలకు చక్కని పరిష్కారమని పలువురు అభివర్ణిస్తున్నారు. అయితే పురుషుల వయాగ్రాకు భిన్నంగా ఇది పని చేస్తుంది. మహిళా వయాగ్రా ప్రధానంగా మెదడుపై పని చేస్తుంది. వారిలోని మానసిక ఆందోళనలను తగ్గిస్తుంది. దీనివల్లే వారిలో లైగింక శక్తి పెరిగి ఉత్తేజితులవుతారని ఎఫ్‌డీయే తెలిపింది.
First Published:  19 Aug 2015 8:01 PM GMT
Next Story