Telugu Global
Others

మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌ల నీటి ఆగ‌డాలు 

ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక చేస్తున్న జలాల వినియోగం తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తోంది. రాజ‌కీయాల కోసం నీటి వాటాలో రాజీ ప‌డితే భ‌విష్య‌త్ ప‌రిణామాలు ఎలా ఉంటాయో ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాల‌కు ఇప్పుడు  క్ర‌మంగా అర్థ‌మ‌వుతోంది. ఉమ్మ‌డి రాష్ట్రంలోని ప్ర‌భుత్వాలు రాజ‌కీయాల కోసం నీటి ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెట్టినందుకు ఇప్పుడు ఉభ‌య‌ రాష్ట్ర ప్ర‌జ‌లూ తాగు నీటికి సైతం అల్లాడుతున్నారు. ఎగువ రాష్ట్రాలు మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌లు మాత్రం  త‌మ వాటాల‌ను అడ్డు పెట్టుకుని సొంత […]

మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌ల నీటి ఆగ‌డాలు 
X
ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక చేస్తున్న జలాల వినియోగం తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తోంది. రాజ‌కీయాల కోసం నీటి వాటాలో రాజీ ప‌డితే భ‌విష్య‌త్ ప‌రిణామాలు ఎలా ఉంటాయో ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాల‌కు ఇప్పుడు క్ర‌మంగా అర్థ‌మ‌వుతోంది. ఉమ్మ‌డి రాష్ట్రంలోని ప్ర‌భుత్వాలు రాజ‌కీయాల కోసం నీటి ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెట్టినందుకు ఇప్పుడు ఉభ‌య‌ రాష్ట్ర ప్ర‌జ‌లూ తాగు నీటికి సైతం అల్లాడుతున్నారు. ఎగువ రాష్ట్రాలు మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌లు మాత్రం త‌మ వాటాల‌ను అడ్డు పెట్టుకుని సొంత ప్ర‌యోజ‌నాల కోసం య‌ధేచ్ఛ‌గా విద్యుత్‌ను కూడా ఉత్ప‌త్తి చేస్తున్నాయి. ఆల్మ‌ట్టి ద్వారా క‌ర్ణాట‌క నీటిని వాడుతుంటే, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కోయినా ప్రాజెక్టులో 100 టీఎంసీల నీటిని ఇప్ప‌టికే విద్యుత్ ఉత్ప‌త్తికి వాడేస్తోంది. మ‌రో 30 టీఎంసీల నీటిని అరేబియా స‌ముద్రంలోకి విడిచి పెట్టింది. వ‌ర్షాభావ ప‌రిస్థితుల కార‌ణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ధాన ప్రాజెక్టుల‌న్నీ నీరు లేక ఎండి పోయాయి. కృష్ణా ప్రాజెక్టులో 20 టీఎంసీల నీరు కూడా లేదు. ఈ నీటినే 3 కోట్ల మందికి స‌ర‌ఫ‌రా చేయాలి. అయితే, ఈ ప‌రిస్థితుల‌తో త‌మ‌కు సంబంధం లేద‌న్న‌ట్లు క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ రెండు రాష్ట్రాల ప్రాజెక్టులు నీటితో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. అంతేకాదు య‌ధేచ్చ‌గా విద్యుత్ ఉత్ప‌త్తి చేసి 25 టీఎంసీల పైగా నీటిని అరేబియా స‌ముద్రంలోకి విడిచిపెట్టాయి. బ‌చావ‌త్ ట్రిబ్యున‌ల్ ప్ర‌కారం త‌మ‌కు కేటాయించిన నీటిని ఇష్టం వ‌చ్చిన‌ట్టు వాడుకునే స్వేచ్ఛ ఉంద‌న్న కార‌ణంగా ఎగువ రాష్ట్రాలు చేస్తున్న నీటి దౌర్జ‌న్యాన్ని అడ్డుకోవాల‌ని రెండు రాష్ట్రాల నీటిపారుద‌ల శాఖ అధికారులు ప్ర‌భుత్వాల‌ను కోరుతున్నారు.
First Published:  20 Aug 2015 2:13 AM GMT
Next Story