బర్త్ డే కి ముందే సినిమాపై క్లారిటీ

చిరంజీవి షష్టిపూర్తి వేడుకకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. పుట్టినరోజు నాడు తన 150వ సినిమాకు సంబంధించి చిరంజీవి మరిన్ని వివరాలు వెల్లడిస్తారని అంతా ఊహించారు. అయితే పుట్టినరోజుకు ఒకరోజు ముందే చిరు తన రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. ఎన్నో కొత్తవిషయాలు చెప్పుకొచ్చాడు. పూరి జగన్నాధ్ తో సినిమా ఆగిపోయిందనే విషయాన్ని స్పష్టంచేశారు చిరు. పూరి జగన్నాధ్ చెప్పిన ఆటోజానీ స్టోరీ చాలా బాగుందని చెబుతూనే.. సెకెండాఫ్ కుదరలేదన్నారు. అందుకే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని స్పష్టంచేశారు. మరో 2 నెలల్లో కథ సిద్ధమౌతుందన్నారు చిరంజీవి. కథ సిద్ధమయ్యాక స్టోరీలైన్ ను బట్టి డైరక్టర్ ను నిర్ణయిస్తామన్నారు. మరోవైపు మనం సినిమా తరహాలో మెగా హీరోలందరం కలిసి నటించే కథ కోసం కూడా వేట మొదలైనట్టు స్పష్టంచేశారు. అయితే మనం తరహా కథ అందరికీ సూట్ కాదని కూడా అంటున్నారు చిరు. మొత్తమ్మీద చిరంజీవి 150వ సినిమాపై ప్రకటన రేపు లేదన్నమాట.