Telugu Global
Others

సైనెడ్‌ ధాటికి వేలాది చేపల మృతి!

ఒక భారీ విస్పోటనాలు కొన్ని లక్షల చేపల మృతికి కారణమైంది. చైనాలోని ప్రముఖ రేవు పట్టణమైన తియాంజియాన్ నగరంలో ఇటీవల భారీ విస్ఫోటనాలు జరిగాయి. ఈ పేలుళ్ల ధాటికి ఎంతో పటిష్టమైన చైనా గోడ కూడా బీటలు వారింది. ఈ విస్ఫోటనాల వల్ల అతి ప్రమాదకరమైన రసాయనాలు వాతావారణంలోకి వెలువడినట్టు పర్యావరణ వేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత 16 వాటర్ స్టేషన్లలో అత్యంత ప్రమాదకరమైన సోడియం సైనైడ్ ఉన్నట్టు తేలిందని ఎన్విరాన్‌మెంటల్ ఎనర్జీ సెంటర్ […]

సైనెడ్‌ ధాటికి వేలాది చేపల మృతి!
X
ఒక భారీ విస్పోటనాలు కొన్ని లక్షల చేపల మృతికి కారణమైంది. చైనాలోని ప్రముఖ రేవు పట్టణమైన తియాంజియాన్ నగరంలో ఇటీవల భారీ విస్ఫోటనాలు జరిగాయి. ఈ పేలుళ్ల ధాటికి ఎంతో పటిష్టమైన చైనా గోడ కూడా బీటలు వారింది. ఈ విస్ఫోటనాల వల్ల అతి ప్రమాదకరమైన రసాయనాలు వాతావారణంలోకి వెలువడినట్టు పర్యావరణ వేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత 16 వాటర్ స్టేషన్లలో అత్యంత ప్రమాదకరమైన సోడియం సైనైడ్ ఉన్నట్టు తేలిందని ఎన్విరాన్‌మెంటల్ ఎనర్జీ సెంటర్ డైరెక్టర్ తియాన్ వైయాంగ్ తెలిపారు. దీని ప్రభావం వల్లే చైనాలోని తియాంజిన్ నదీ పరివాహక ప్రాంతంలో వేలాది చేపలు చచ్చిపోయి ఉండవచ్చన్న అనుమానాలున్నాయి. చనిపోయిన ఈ చేపలన్నీ ఒడ్డుకు కొట్టుకొచ్చి నీటిపై తేలియాడుతున్నాయి. ఇలా హఠాత్తుగా ఇంత భారీ సంఖ్యలో చేపలు చనిపోవడానికి కారణం మాత్రం అక్కడి వారిని భయకంపితుల్ని చేస్తోంది. భారీ విస్పోటనం వల్ల వాతావరణంలోకి వెదజల్లిన సోడియం సైనైడ్ తియాంజిన్ నదిలో కలిసి ఉంటుందని, అందువల్లే ఇంత భారీ సంఖ్యలు చేపలు మరణించాయని తియాన్‌ అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో దీనివల్ల ప్రజలకు ఎలాంటి దుష్పలితాలు సంభవిస్తాయోనని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రజలెవరూ భయపడాల్సిన పని లేదని, సోడియం సైనైడ్ వాతావరణంలో కలిసింది అనేది అపోహ మాత్రమేనని, తాము చేసిన పరీక్షల్లో అలాంటిదేమీ కనబడలేదని అధికారులు వెల్లడించారు. వాటర్‌ స్టేషన్లలో నీరు ఎలా కలుషితం అయ్యిందన్న దానికి మాత్రం వారి వద్ద సమాధానం లేదు. అలాగే ఇన్ని చేపలు ఒకేసారి ఎలా చనిపోయాయన్న దానికి కూడా కారణం వాళ్లు చెప్పలేకపోతున్నారు.
First Published:  20 Aug 2015 11:49 PM GMT
Next Story