Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 181

పగటి కల నరేష్‌ “నాకు కోపం వస్తే మనిషిని కాను. మా ఆవిడ టీలో చక్కెర తక్కువ వేస్తే చెంప పగలగొట్టాను” అన్నాడు గర్వంగా. సురేష్‌ “అబ్బా! నీకు పగటి పూట కూడ కలలు వస్తాయే” అన్నాడు. —————————————————————————— ప్రేమ నిద్ర “నిన్న రాత్రి నిద్రలో నీకు ప్రపోజ్‌ చేసినట్లు కల వచ్చింది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది?” అన్నాడు ప్రియుడు ప్రియురాలితో ప్రియురాలు: “దీన్నిబట్టి మెలకువలో కన్నా నిద్రలో నీ బుర్ర బాగా పనిచేస్తున్నట్లుంది” అంది. […]

పగటి కల
నరేష్‌ “నాకు కోపం వస్తే మనిషిని కాను. మా ఆవిడ టీలో చక్కెర తక్కువ వేస్తే చెంప పగలగొట్టాను” అన్నాడు గర్వంగా.
సురేష్‌ “అబ్బా! నీకు పగటి పూట కూడ కలలు వస్తాయే” అన్నాడు.
——————————————————————————
ప్రేమ నిద్ర
“నిన్న రాత్రి నిద్రలో నీకు ప్రపోజ్‌ చేసినట్లు కల వచ్చింది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది?” అన్నాడు ప్రియుడు ప్రియురాలితో
ప్రియురాలు: “దీన్నిబట్టి మెలకువలో కన్నా నిద్రలో నీ బుర్ర బాగా పనిచేస్తున్నట్లుంది” అంది.
——————————————————————————
దూకుడు
“రాధా! నీ కోసం ఆ కొండమీది నించీ దూకి చచ్చిపోమన్నా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను”
“సంవత్సరం నించీ అదేమాట చెబుతున్నావు. చేసి చూపించు”
——————————————————————————
ఉంగరం మహిమ
మాధవి ఒక హస్త సాముద్రికుడి దగ్గరకు వెళ్లి చెయ్యి చూపించింది.
అతను ఆమె చేతిని సీరియస్‌గా చూసి…
“నువ్వు ఆరడుగుల కుర్రాడి ప్రేమలో పడ్డావు. అతని ముందు పళ్లలో ఒకటి రాలిపోయింది”.
“ఆశ్చర్యం! ఎలా చెప్పగలిగారు? చేతిలో గీతల్ని బట్టి ఈ సంగతి చెప్పారంటే నమ్మలేకపోతున్నాను”.
“అంతేకాదు అతని పేరు రాజేష్‌”
“వండర్‌! మీరు జీనియస్‌”
“అదేం కాదు. నువ్వు పెట్టుకున్న రింగు నాది. పది రోజుల క్రితం అతనికిచ్చాను”.

First Published:  20 Aug 2015 1:03 PM GMT
Next Story