Telugu Global
National

రేప్ వ్యాఖ్యలపై ములాయంకు కోర్టు సమన్లు

మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా ఇటీవ‌ల స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాద‌వ్ వ్యాఖ్య‌లతో ఆయ‌న చిక్కుల్లో ప‌డ్డారు. ఒక మ‌హిళ‌ను న‌లుగురు ఎలా రేప్ చేస్తారు? అని మీడియా ఎదుట ప్ర‌శ్నించి దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ములాయం వ్యాఖ్య‌ల‌పై మీడియా కథనాలను ఉత్తరప్రదేశ్‌లోని కుల్పహాడ్ కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు సెప్టెంబర్ 16న కోర్టుకు హాజరు కావాల్సిందిగా ములాయంకు శుక్రవారం సమన్లు జారీచేసింది. ములాయం ఈ నెల 18న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, […]

రేప్ వ్యాఖ్యలపై ములాయంకు కోర్టు సమన్లు
X
మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా ఇటీవ‌ల స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాద‌వ్ వ్యాఖ్య‌లతో ఆయ‌న చిక్కుల్లో ప‌డ్డారు. ఒక మ‌హిళ‌ను న‌లుగురు ఎలా రేప్ చేస్తారు? అని మీడియా ఎదుట ప్ర‌శ్నించి దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ములాయం వ్యాఖ్య‌ల‌పై మీడియా కథనాలను ఉత్తరప్రదేశ్‌లోని కుల్పహాడ్ కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు సెప్టెంబర్ 16న కోర్టుకు హాజరు కావాల్సిందిగా ములాయంకు శుక్రవారం సమన్లు జారీచేసింది. ములాయం ఈ నెల 18న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఒక్కరు లైంగికదాడికి పాల్పడితే నలుగురిపై కేసు పెడుతున్నారు. ఒక మహిళపై నలుగురు లైంగికదాడికి పాల్పడటం ఎలా సాధ్యం? అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో ములాయంపై దేశ‌వ్యాప్తంగా తీవ్ర నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. దేశంలో అత్యున్న‌త‌మైన ప్ర‌ధాని ప‌ద‌విని ఆశించే వ్య‌క్తి ఇలాంటి బాధ్య‌తారాహిత్య‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డం ఆయ‌న వ్య‌క్తిత్వానికి, మ‌హిళ‌ల‌ప‌ట్ల ఆయ‌న‌కున్న చిన్న‌చూపున‌కు నిద‌ర్శ‌నంగా నిలిచాయ‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్య‌లు ములాయం కొత్తేం కాదు. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న లైంగిక‌దాడి విష‌యంలోనూ ఆయ‌న ప‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న కుమారుడు, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ సీఎం అఖిలేష్ కూడా ఇలాంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కొంత‌కాలం క్రితం విడుద‌లైన పీకే సినిమాను పైర‌సీ కాపీ డౌన్‌లోడ్ చేసి చూశాన‌ని చెప్ప‌డం కూడా వివాదాస్ప‌దం అయింది. సీఎం అయి ఉండి పైర‌సీని ప్రోత్స‌హించేలా వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని ప‌లువురు సినీతార‌లు మండిపడ్డారు.
First Published:  22 Aug 2015 12:12 AM GMT
Next Story