Telugu Global
Others

కాంగ్రెస్‌లో చిరంజీవి భవిష్యత్‌ క్రియాశీలకం?

కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవి.. ఇప్పుడు కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా మారుతున్నారు. అటు సినిమా రంగంలోను… ఇటు రాజకీయ రంగంలోను ఇక తనదైన ముద్ర వేసేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. నటుడిగా తనకున్న చరిష్మా ఇంకా అలాగే ఉందని, తను ఇప్పటికీ నటుడిగా మెగాస్టారేనని నమ్మే చిరంజీవి… రాజకీయాల్లో కూడా మెగాయిజాన్ని చూపాలనుకుంటున్నారు. పరిస్థితులన్నీ అనుకూలిస్తే ఆయనే ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌కు మెగా నాయకుడయ్యే అవకాశం ఉంది. విభజన అనంతరం… ఏపీలో అంపశయ్య మీద ఉన్న పార్టీకి చిరునే […]

కాంగ్రెస్‌లో చిరంజీవి భవిష్యత్‌ క్రియాశీలకం?
X
cpvvsకోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవి.. ఇప్పుడు కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా మారుతున్నారు. అటు సినిమా రంగంలోను… ఇటు రాజకీయ రంగంలోను ఇక తనదైన ముద్ర వేసేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. నటుడిగా తనకున్న చరిష్మా ఇంకా అలాగే ఉందని, తను ఇప్పటికీ నటుడిగా మెగాస్టారేనని నమ్మే చిరంజీవి… రాజకీయాల్లో కూడా మెగాయిజాన్ని చూపాలనుకుంటున్నారు. పరిస్థితులన్నీ అనుకూలిస్తే ఆయనే ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌కు మెగా నాయకుడయ్యే అవకాశం ఉంది. విభజన అనంతరం… ఏపీలో అంపశయ్య మీద ఉన్న పార్టీకి చిరునే కీలక నేతగా మారనున్నారా…? సమర్థ నాయకత్వం కొరవడి, శ్రేణులు డీలాపడి చుక్కాని లేని నావలా తయారైన కాంగ్రెసుకు చిరంజీవి దిక్కు… దిక్సూచిగా మారబోతున్నారా? అనే ప్రశ్నకు ఇపుడు కాంగ్రెస్‌లోని కొంతమంది సీనియర్లు అవుననే చెబుతున్నారు. ఏడేళ్ల క్రితం ప్రజారాజ్యం పార్టీ స్థాపన ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన చిరంజీవి బహుశా ఊహించని ఫ్లాప్‌నే చవి చూడాల్సి వచ్చింది. ఎత్తులు, జిత్తులు… వ్యూహ ప్రతివ్యూహాలు తెలియకపోవడం… నమ్ముకున్న వాళ్లు నట్టేట ముంచడంతో అడుగడుగునా ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి భారం దించుకున్నారు. ప్రతిఫలంగా యూపీఏ ప్రభుత్వంలో సహాయమంత్రి పదవి దక్కించుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెసు అధిష్టానానికి ఎన్ని సూచనలు చేసినా సోనియా చెవి కెక్కించుకోలేదు. దీంతో ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ ఇమేజ్ డ్యామేజ్‌ అయ్యి మౌనాన్నిఆశ్రయించారు. రాష్ట్ర కాంగ్రెసు ప్రచార బాధ్యతలు అప్పగించినా పోషించిన పాత్ర అంతంత మాత్రమే. ఎన్నికల్లో కాంగ్రెసు ఘోర పరాజయంతో ఇక ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరమూ లేదన్నట్లుగా చిరంజీవి దాదాపు ఏడాది కాలంగా తెర వెనుకకే పరిమితమయ్యారు.
మెగాస్టార్‌పైనే అధిష్టానం కన్ను
తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలను దునుమాడడానికి… వైఎస్ఆర్ పార్టీలో ఉన్న బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి కాంగ్రెస్‌ను మళ్ళీ పునర్జీవింపజేయాలని అధిష్టానం భావిస్తోంది. ఏపీలో ఎంతమంది సీనియర్‌ నాయకులున్నా జనంలో ఇమేజ్‌ ఉన్న చిరంజీవి తురుపుమొక్కగా పనికి వస్తాడని భావిస్తోంది. మరోసారి తన కరిష్మాను ఫ్రయోగించి కాంగ్రెసు పార్టీకి పునరుత్తేజం కలిగించేందుకు చిరంజీవి ఒక్కరే సమర్ధ నాయకుడని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల అనంతపురం జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటనలోనూ, తిరుపతిలో ప్రత్యేక హోదాపై సాగిన సభలోనూ చిరంజీవి చురుకైన పాత్ర పోషించడమే ఇందుకు నిదర్శనమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రియాశీల పాత్ర వెనుక పార్టీ పెద్దల హస్తముందని చెబుతున్నారు. ‘ఇప్పుడు కాంగ్రెసు పార్టీకి ఒక క్రౌడ్ పుల్లర్ అవసరం ఉంది. అందుకు చిరంజీవిని మించిన అస్త్రం మరొకటి లేదు. పార్టీ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక సాధనంగా మెగాస్టార్ తోడ్పడతాడనే భావన పార్టీ వర్గాల్లో ప్రబలంగా ఉంది. అధిష్ఠానం కూడా అదే ఉద్దేశంతో చిరంజీవికి పార్టీలో ప్రాముఖ్యాన్ని పెంచాలని యోచిస్తుంది’ అని పార్టీలోని ఓ సీనియర్‌ నాయకుడు అన్నారు. అనంతపురం పర్యటనలో రాహుల్‌ గాంధీ చిరంజీవికి ఎనలేని ప్రాముఖ్యత ఇవ్వడానికి కూడా కారణం ఇదేనని ఆయన చెప్పారు.
సినిమా… రాజకీయం… రెండూ ఒకటే
అవమానాలు, పరాభవాలు చిరంజీవికి కొత్తేం కాదు. సినీ రంగంలో మొదట చవిచూసినట్టే ఆయన రాజకీయ రంగంలోను అనుభవించారు. సినిమా రంగంలో మాదిరిగానే ఆయన ఇక్కడ కూడా సహనం ప్రదర్శిస్తున్నారు. హడావుడి చేయడం వల్ల, అలవిగాని చోట అధికులమనడం వల్ల పెద్దగా ప్రయోజనం చేకూర్చదని చిరంజీవికి తెలుసు. అందుకే ఎప్పుడూ లోప్రొఫైల్‌ మెయింటైన్‌ చేసే తత్వాన్ని అలవరుచుకున్నారు. అయినా ఎదురు వచ్చే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారు. సినీ ఆకాశంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన మెగాస్టార్ రాజకీయ రంగంలో మాత్రం తన అస్తిత్వాన్ని నిలుపుకుని కొత్త ముద్ర వేసే దిశలో ప్రస్తానిస్తున్నారు. అందుకు ఇదే మంచి తరుణం అని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం కలిసొస్తే ఏపీకి కాంగ్రెస్‌ మహారాజు ఆయనే! – పీఆర్‌ చెన్ను
First Published:  22 Aug 2015 9:00 PM GMT
Next Story