Telugu Global
International

ఆరు నిమిషాల్లో సెల్‌ ఫుల్‌ చార్జింగ్‌!

సెల్‌ఫోన్ రీచార్జ్ అయ్యేందుకు ఎక్కువ సమయం అవసరంలేని, పేలిపోయే ప్రమాదంలేని సరికొత్త బ్యాటరీని బీజింగ్‌కు చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. అల్యూమినియంతో నింపిన నాళిక గల ఈ బ్యాటరీ కేవలం ఆరు నిమిషాల్లోనే రీచార్జ్ కావడంతోపాటు ప్రస్తుతం మార్కెట్లలో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీల కన్నా నాలుగు రెట్లు ఎక్కువ చార్జింగ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. ఇంతకుముందు కూడా అల్యూమినియం బ్యాటరీలు మార్కెట్లోకి వచ్చినా.. వాటివల్ల ఎదురయ్యే సమస్యలన్నింటినీ అధిగమించేలా తాజా బ్యాటరీని రూపొందించినట్లు బీజింగ్‌లోని సింగువా యూనివర్సిటీకి […]

ఆరు నిమిషాల్లో సెల్‌ ఫుల్‌ చార్జింగ్‌!
X
సెల్‌ఫోన్ రీచార్జ్ అయ్యేందుకు ఎక్కువ సమయం అవసరంలేని, పేలిపోయే ప్రమాదంలేని సరికొత్త బ్యాటరీని బీజింగ్‌కు చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. అల్యూమినియంతో నింపిన నాళిక గల ఈ బ్యాటరీ కేవలం ఆరు నిమిషాల్లోనే రీచార్జ్ కావడంతోపాటు ప్రస్తుతం మార్కెట్లలో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీల కన్నా నాలుగు రెట్లు ఎక్కువ చార్జింగ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. ఇంతకుముందు కూడా అల్యూమినియం బ్యాటరీలు మార్కెట్లోకి వచ్చినా.. వాటివల్ల ఎదురయ్యే సమస్యలన్నింటినీ అధిగమించేలా తాజా బ్యాటరీని రూపొందించినట్లు బీజింగ్‌లోని సింగువా యూనివర్సిటీకి చెందిన మస్సాచు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్కాలజీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అల్యూమినియం బ్యాటరీ నాళికపై టైటానియం డై ఆక్సైడ్ పూతపూయడం వల్ల దీని సంకోచ, వ్యాకోచాలు వేగంగా ఉంటాయని, దీంతో పేలిపోయే ప్రమాదాలు కూడా ఉండవని వారు తెలిపారు.
మొబైల్‌ను శుభ్రం చేసే క్లీనర్‌
బ్యాక్టీరియాను నిర్మూలించడంతోపాటు ఫోన్‌ను చార్జింగ్‌ చేసే సరికొత్త పరికరాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సెల్‌ఫోన్‌పై పెరుగుతున్న బ్యాక్టీరియాను నిర్మూలించేందుకు ఈ చార్జర్‌ సరైన ప్రత్యామ్నాయమని వారు తెలిపారు. నిత్యం మనలో భాగమైపోయిన సెల్‌ఫోన్‌లో బ్యాక్టీరియా తయారవుతోందని గత పరిశోధనలు స్పష్టం చేశాయి. ఇందులోని అతి నీలలోహిత కిరణాలు ఫోన్‌పై ఉన్న సూక్ష్మక్రిములను కేవలం నాలుగు నిమిషాల్లో పూర్తిగా తుడిచి పెట్టేస్తాయని దీని రూపకర్తలు చెబుతున్నారు. ప్రస్తుతం మనం వాడుతున్న సెల్‌ఫోన్‌లలో చాలా వరకు దీంతో చార్జింగ్‌ చేసుకోవచ్చని దీని రూపకర్తలు చెబుతున్నారు. బ్యాక్టీరియాను నిర్మూలించే ఈ చార్జర్‌ వెల 60 డాలర్ల(దాదాపు రూ.4 వేలు)ని దీన్ని రూపొందించిన ఫోన్‌ సోప్‌ కంపెనీ తెలిపింది.
First Published:  23 Aug 2015 11:50 PM GMT
Next Story